విజువల్ ఫీస్ట్ గా రూపొందిన ‘మర్ద్ మరాఠా’ సాంగ్ 

'Mard Maratha' Song which was created as Visual Feast

'Mard Maratha' Song which was created as Visual Feast

Date:13/11/2019

భారతదేశ చరిత్రలో పానిపట్‌ యుద్దాలకు ఉన్న ప్రత్యేకత అందరికీ తెలిసిందే. మూడవ పానిపట్‌ యుద్ధం(14 జ‌న‌వ‌రి 1761 ) కథాంశంగా రూపొందుతున్న పీరియాడికల్‌ మూవీ ‘పానిపట్‌’. స్టార్‌ డైరెక్టర్‌ అశుతోష్‌ గోవర్‌కర్‌ దర్శకత్వంలో సునీత గోవర్‌కర్‌, రోహిత్‌ షెలాత్కర్‌ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరాఠా యోధుడు సదాశివరావ్‌ పాత్రలో అర్జున్‌ కపూర్‌, గోపికాబాయి పాత్రలో పద్మిని కొల్హాపురి, కృతిసనన్‌ పార్వతీబాయిగా, మరియు సంజయ్‌దత్‌ ఆహ్మద్‌ అబుద్‌అలీగా నటిస్తున్నారు. పురన్‌దాస్‌ గుప్తా కూడా ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవల విడుదల చేసిన పోస్టర్స్‌తో పాటు థియేట్రికల్‌ ట్రైలర్‌ కి దేశ వ్యాప్తంగా ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా  భారీ విజువల్స్‌, రీరికార్డింగ్‌, ఆర్ట్‌ వర్క్‌కి ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ వస్తుంది. భారీ బడ్జెట్‌, హై టెక్నికల్‌ వేల్యూస్‌తో రూపొందిన ఈ హిస్టారికల్‌ విజువల్‌ వండర్‌ డిసెంబర్‌ 6న  ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. లేటెస్ట్ గా ఈ చిత్రం నుండి ‘మర్ద్ మరాఠా’ సాంగ్ ని ముంబాయి లోని సిద్ది వినాయక మందిరంలో చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘మర్ద్ మరాఠా’  సాంగ్ భారీ స్థాయిలో చిత్రీకరించబడింది, బ్యాక్ గ్రౌండ్ లో పెద్ద గణేష్ విగ్రహం, పేష్‌వై వాతావరణం నేపథ్యంలో పూణేకు చెందిన లెజిమ్ నృత్యకారులు, అథెంటిక్ బుల్ డాన్సర్లతో సహా 1300  మందితో ఈ పాటను విజువల్ గా చాలా గ్రాండియర్ గా చిత్రీకరించారు.  ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్‌  రాజు ఖాన్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటను 13 రోజులలో కర్జాత్‌లోని శనివార్ వాడా లోని  రీగల్ లైఫ్-సైజ్ సెట్‌లో చిత్రీకరించారు, ఈ సెట్ ను ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ నిర్మించారు. హిందీ-మరాఠీ ఫీల్ ఉన్న పాట ఇది.  ఈ పాట‌లో అర్జున్ కపూర్, కృతి సనోన్, మోహ్నీష్ బహల్, పద్మిని కొల్హాపురే న‌టించారు.  అజయ్-అతుల్ ఈ గీతాన్ని స్వరపరిచారు.

 

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

 

Tags:’Mard Maratha’ Song which was created as Visual Feast

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *