కనీవినీ ఎరుగని రీతిలో మరిడమ్మ తల్లి జాతర

విశాఖపట్నం ముచ్చట్లు:

గొలుగొండ మండలం నాగాపురం ప్రజల ఆరాధ్య దైవమైన శ్రీ మరిడమ్మ తల్లి జాతర మహోత్సవాలను కనివినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆ గ్రామ సర్పంచ్ యలమంచిలి రఘురాం చంద్రరావు తెలిపారు. ఈ నెల 24, 25 తేదీల్లో వేడుకలను ఘనంగా చేపడతామన్నారు. 24న రాత్రి ప్రేమ్ కుమార్ ఆర్ట్స్ వారి డాన్స్, 25న అనంతపురం వారి బుర్ర కథ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. మరిన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు.  విద్యుద్దీపాలంకరణ, మందుగుండు సామగ్రి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెప్పారు. చుట్టు పక్కల గ్రామస్తులంతా తరలివచ్చి జాతర మహోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.

 

Tags: Maridamma’s mother’s fair in an unprecedented manner

Leave A Reply

Your email address will not be published.