Natyam ad

పాలిటెక్నికళాశాలలో గంజాయి విక్రయాలు

మంచిర్యాల ముచ్చట్లు:


మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గంజాయి కలకలం రేపుతోంది. గంజాయి మత్తులో పలువురు సీనియర్ విద్యార్థులు తూగుతున్న వైనం బయటపడింది. ఈ వ్యవహారం మూడు నెలలుగా  గుట్టుగా సాగుతున్నదని విద్యార్దులు అంటున్నారు. ఇందిరమ్మ కాలనీ నుండి గంజాయి కాలేజీలోకి చేరుతుంది. కాలేజీలోని 20 మంది విద్యార్థులు గంజాయికి బానిసైనట్లు అనుమానిస్తున్నారు.ప్రాథమికంగా ఆరుగురుని గుర్తించి ప్రిన్సిపల్ రవీందర్ రెడ్డి హస్టల్ నుండి తొలగించారు. గంజాయి విక్రయాలపై విచారణ రహస్యంగా కొనసాగుతుందని సమాచారం. మంచిర్యాల నుండి గంజాయి సరపరా అవుతున్నట్టుగా గుర్తించారు. బానిసైన విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు.

 

Tags; Marijuana sales in polytechnics

Post Midle
Post Midle