కేటిఆర్ క్లాసుతో మారేనా

ఖమ్మం ముచ్చట్లు:


ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ అగ్రనేతల మధ్య ఆధిపత్య పోరు ప్రస్తుతానికి నివురుగప్పిన నిప్పులా ఉన్నా.. సందర్భాన్ని బట్టి అది బయటకు వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే అన్ని నియోజకవర్గాల్లో పార్టీలో వర్గవిభేదాలు భగ్గుమంటున్నాయి. ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు, ముగ్గరు నేతల మధ్య పోటీ నడుస్తోంది. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించుకుంటూ పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు అగ్రనేతలు సైతం ఎవరికి వారు సొంత అజెండాతో ముందుకు పోతున్నారు. దీంతో పార్టీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇటీవల పీకే రిపోర్టు అంటూ ఓ సర్వే నివేదిక కూడా ఉమ్మడి జిల్లాలో పార్టీ పరిస్థితి బాగోలేదని తేల్చిచెప్పినట్లు ప్రచారం జరిగింది. అయితే ఉమ్మడి నేతల మధ్య వర్గపోరును తగ్గించి అందరూ ఒకేతాటిపై నడిచేలా యువనేత ఎన్నోసార్లు ప్రయత్నించినా ఫలితాన్ని ఇచ్చినట్లు కనిపించడం లేదు. కేటీఆర్ మంత్రాంగం కొంతకాలం వరకు పనిచేసినా మళ్లీ ఎవరి ధోరణిలో వారు వెళ్తూనే ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టకుని 11వ తేదీ ఖమ్మం వచ్చిన కేటీఆర్ మళ్లీ ఉమ్మడి జిల్లా నేతలకు క్లాస్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని చెబుతూనే.. కొంతమంది నేతలకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. ఏది ఏమైనా గతంలో ఎన్నోసార్లు కేటీఆర్ సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేసినా అది నేరవేరలేదు..సంచలనాలకు ఖమ్మం టీఆర్ఎస్ పార్టీ వేదికవుతోంది. జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు, పువ్వాడ అజయ్ కుమార్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముగ్గురూ మూడు పార్టీల నుంచి టీఆర్ఎస్‌లోకి వచ్చారు. ముగ్గురూ మంచి పట్టున్న నేతలే.. ఎవరి వర్గాలు వారికున్నాయి. ముగ్గురికీ ఒకరంటే ఒకరికి పడదు. అయితే.. ముగ్గురూ ఒకే ‘కారు’లో ప్రయాణించాల్సింది పోయి..

 

 

 

ఎవరిదారిలో వారు పోతున్నారని. దీంతో జిల్లాలో రగడ మొదలైందని పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. వారు అనుచరులూ, అభిమానుల్లోనూ ఆధిపత్యం కనిపిస్తుంటుంది. దీంతో అన్ని నియోజకవర్గాల్లో వారి వారి అనుచరుల మధ్యే ఎవరికి వారు ఆధిపత్యం చెలాయించుకున్న ఘటనలు ఇటీవల చాలానే చోటు చేసుకున్నాయి.ఖమ్మం పర్యటను వచ్చిన కేటీఆర్ పార్టీ నేతలందరితో ఓ సమావేశాన్ని ఏర్పరచినట్లు కూడా తెలుస్తోంది. ఈ సమావేశంలో ఖమ్మం లీడర్లకు కేటీఆర్ క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. పాత, కొత్త అందరినీ కలుపుకు పోవాలని సూచించినట్లు తెలుస్తోంది. పార్టీలో నాయకులంతా సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలన్నట్లు సమాచారం. అంతేకాదు.. పీకే సర్వేకు సంబంధించిన అంశాలు, కొంతమంది నాయకుల తీరు, వివాదాల్లో తలదూర్చడం వంటివాటిపై కూడా మాట్లాడినట్లు సమాచారం. అంతేకాదు జాతీయ రాజకీయాలపై టీఆర్ఎస్ దృష్టిపెట్టడం వంటి అంశాలు కూడా చూచాయగా చర్చించినట్లు సమాచారం.ఉమ్మడి జిల్లా రాజకీయాలపై ప్రత్యేక దృష్టిసారించిన కేటీఆర్ మరి అగ్రనేతల మధ్య సయోధ్య కుదిర్చేనా అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ప్రస్తుతం అంతా ఓకే అన్నా.. తర్వాత షరా మామూలే అన్నట్లు ఎవరికి వారు ఆధిపత్య ధోరణితో ప్రవర్తిస్తున్నారని గతంలో జరిగిన సంఘటనలను బట్టి అర్థమైంది. ప్రస్తుతం ఎమ్యుల్యేల పనితీరుపై అధిష్టానం నివేదిక తెప్పించుకుంటున్న తరణంలో ఖమ్మంలో పార్టీ పరిస్థితి బాగోలేదని తేలినట్లు ప్రచారం జరుగుతుంది.. ఇది ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో ఏంటనేది పార్టీ పెద్దలకు అంతుచిక్కడం లేదట. అందుకే కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగి నేతలందరినీ ఒకే తాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.

 

Post Midle

Tags: Marina with KTR class

Post Midle
Natyam ad