Natyam ad

మార్క్ ఫెడ్ ద్వారా రాగులు కొనుగోలు

విశాఖపట్నం ముచ్చట్లు:
ఈ క్రాఫ్ నమోదు చేసుకున్న గిరి రైతుల నుంచి రాగుల పంటను మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని అరుకు వ్యవసాయశాఖ ఏ డి శ్రీధర్ రావు చెప్పారు. మంగళవారం మండల కేంద్రంలో సందర్శించిన ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ రాగుల పంట కిలో రూ 33 లు తో ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు. దీని ద్వారా రైతులకు ఆర్థికంగా చాలా ఉపయోగం కలుగుతుందని చెప్పారు. గత ఏడాది స్థానిక డుంబ్రిగూడ మండలంలోని 40 టన్నులు రాగులు కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఈసారి కనీసం వంద టన్నుల అయినా కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. స్థానిక గ్రామ సచివాలయ లోనున్న వ్యవసాయ శాఖ సిబ్బందితో రైతులకు చైతన్యపరచి స్థానిక పంచాయతీ కేంద్రంలో ఉన్న ఆర్ బి కె కేంద్రాల్లోనే కొనుగోలు చేపడతామని చెప్పారు. జనసేన విక్రయించిన రైతులకు వారం రోజుల్లోగా తమ వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందని, మారుమూల ప్రాంతాల గిరి రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Mark bought the rags through the Fed