మార్కెట్ యార్డ్ పునః ప్రారంభం-ఆనందంలో రైతులు.

‌పత్తికొండ ముచ్చట్లు:

 

తీవ్రంగా వ్యాపించిన కరోనా వైరస్ ను నివారించడం కోసం పట్టణం లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ బంద్ ను ఏప్రిల్ 10 వ తేదీన బంద్ చేశారు. యార్డ్ ను రెండున్నర నెలల పాటు బంద్ చేయడంతో రైతులు, వ్యాపారస్తులు, మార్కెట్ యార్డ్ అధికారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మార్కెట్ బంద్ కావడంవల్ల ఆదాయం కోల్పోవడం వల్ల కనీస మార్కెట్ యార్డ్ సిబ్బంది వేతనాలు అందని పరిస్థితులు ఏర్పడ్డాయి. మార్కెట్ జరుగుతున్న సమయంలో రైతులు నుంచి గొర్రెలు, మేకలు, ఎనుములు, ఎద్దులను కొనుగోలు చేసిన వ్యాపారస్తులు 30 నుంచి 40 లక్షలు వరకూ రైతులకు ఇవ్వాల్సి ఉంది. మార్కెట్ యార్డ్ బంద్ చేయడంతో వ్యాపారస్తుల నుంచి డబ్బులు అందుతాయో లేదోనని రైతులు తీవ్రంగా కలవరం చెందుతున్నారు. మార్కెట్ ఎప్పుడు నిర్వహిస్తారంటూ ప్రతిరోజు రైతులు మార్కెట్ యార్డ్ కార్యాలయం చుట్టూ తిరగడం వల్ల అధికారులు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డారు. ఇలాంటి సమయంలో మార్కెట్ యార్డ్ కార్యదర్శి శ్రీనివాసులు రెండుసార్లు ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి దృష్టి కి వెళ్లి సమస్యలు వివరించారు. మార్కెట్ యార్డ్ బంద్ కావడం వల్ల మార్కెట్ ఆరు లక్షలు ఆదాయం కోల్పోయామని చెప్పారు. వ్యాపారస్తుల నుంచి 30 నుంచి 40 లక్షలు రైతులు కోల్పోయే పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. అందుకు ఎమ్మెల్యే స్పందించి జెసి కలెక్టరు, ఏడి, ఎస్పీతో చర్చించారు. అందుకు స్పందించిన అధికారులు మార్కెట్ యార్డ్ పునఃప్రారంభం చేయడానికి అనుమతులు జారీ చేశారని మార్కెట్ యార్డ్ కార్యదర్శి శ్రీనివాసులు అన్నారు. మూతపడిన మార్కెట్ యార్డు 28వ తారీకు అనగా సోమవారం ప్రారంభిస్తామన్నారు. రైతులు వ్యాపారస్తులు పాల్గొంటారని తెలిపారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Market yard reopen — farmers in bliss.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *