అగ్నిప్రమాదంలో వివాహిత మృతి

హైదరాబాద్ ముచ్చట్లు :

 

హైదరాబాద్ వనస్థలిపురం లో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అక్కడున్న ఒక అపార్ట్మెంట్ లోని మొదటి అంతస్తులో తెల్లవారుజామున విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. అప్పటికే నిద్రలో ఉన్న ఆ ఇంట్లోని వారు దాన్ని గమనించలేకపోయారు. మంటలు ఒక మహిళకు అంటుకొని కేకలు వేయడంతో నిద్రలేచిన అపార్ట్మెంట్ వాసులు బయటకు పరుగులు తీశారు. అప్పటికే మంటలు సెకండ్ ఫ్లోర్ వరకు వెళ్లిపోయాయి. మంటల్లో చిక్కుకుని వివాహిత మృతి చెందింది. ఆమె భర్త, పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు.

 

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags; Married killed in fire

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *