మర్రిగూడ అసుపత్రిని అప్ గ్రేడ్ చేయాలి
నల్గోండ ముచ్చట్లు:
నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో మర్రిగూడ మండల కేంద్రంలో ఉన్న 30 పడకల ప్రభుత్వాసుపత్రిని వంద పడకలుగా మార్పు చేయాలని కోరుతూ సోమవారం భారీ ర్యాలీ నిర్వహించి స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఉప ఎన్నికల్లో మంత్రి హరీష్ రావు స్పష్టమైన హామీ ఇస్తూ మర్రిగూడ ప్రభుత్వ ఆసుపత్రి 100 పడకలుగా తీర్చిదిద్దుతారని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన స్వలాభం కోసం రాజకీయ కుట్రతో చౌటుప్పల్కు తరలించారు. దీనిని నిరసిస్తూ మర్రిగూడ మండల కేంద్రంలో ఆమరణ నిరాహార దీక్ష మర్రిగూడ మండల ప్రజలు చేపట్టారు.
Tags; Marriguda Hospital should be upgraded

