మగపిల్లాడి కోసం బాలికతో పెళ్లి

Date:11/11/2019

చెన్నై ముచ్చట్లు:

కట్టుకున్న భర్తకు దగ్గరుండి మరీ పెళ్లి చేసిందో భార్య. ఓ అమ్మాయికి మాయ మాటలు చెప్పి తీసుకెళ్లారు. తర్వాత అమ్మాయి తల్లిదండ్రులకు విషయం తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన బయటపడింది. భార్యాభర్తల్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఈ కేసులో సినిమాకు మించిన మలుపులు విని పోలీసులకే షాక్ తిన్నారు.తమిళనాడులోని కడలూరు జిల్లా దిట్టకుడి ఉల్లవయ్యంగుడికి చెందిన అశోక్‌కుమార్‌, చెల్లకిళికి ముగ్గురు ఆడపిల్లలు. ముగ్గురూ ఆడపిల్లలు కావడంతో.. వారికి మగ పిల్లాడు కావాలని కోరిక కలిగింది. ఎలాగైనా వారసుడు కావాలన్న ఉద్దేశంతో కన్నింగ్ ప్లాన్ వేశారు. ఇద్దరూ కలిసి స్థానికంగా ఉంటున్న మరో బాలికను ట్రాప్ చేశారు. బాలిక తల్లిదండ్రులకు మాయ మాటలు చెప్పారు. ఈ నెల 7న తమ కుటుంబం ఆలయానికి వెళుతోందని చెప్పి.. బాలికను కూడా వెంటబెట్టుకొని తీసుకెళ్లారు.ఆలయంలో సంప్రదాయ పద్దతుల్లో చెల్లకిళి తన భర్త అశోక్‌కు బాలికతో పెళ్లి చేసింది. తర్వాత మూడు రోజులకు కూడా బాలిక ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. వెంటనే బాలిక తల్లిదండ్రులు అశోక్‌కుమార్‌ భార్యను నిలదీశారు. ఆమె తడబడటం.. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం కలిగింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.ముందు చెల్లకిళిని పోలీసులు అరెస్ట్ చేశారు.. తర్వాత పరారీలో ఉన్న అశోక్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరు బాలికకు మాయ మాటలు చెప్పి పెళ్లి తంతు ముగించినట్లు ఒప్పుకున్నారు. తమకు మగ సంతానం లేకపోవడంతో బాలికను వివాహం చేసుకున్నట్లు ఒప్పుకున్నాడు. అలాగే అశోక్‌కుమార్‌‌పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మగ సంతానం కోసం కక్కుర్తి పడి బాలిక జీవితాన్ని భార్యాభర్తలు నాశనం చేశారు.

 

ఎన్నికల సంస్కర్త టీఎన్ శేషన్ కన్నుమూత

 

Tags:Marrying with a girl for a male

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *