Date:18/06/2020
సూర్యాపేట ముచ్చట్లు:
దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడు సంతోష్ బాబు కు యావత్ ప్రజానీకం అశ్రునివాళి అర్పించింది. కల్నల్ సంతోష్ బాబు అంతిమయాత్రలో భారీగా ప్రజలు పాల్గొన్నారు. సూర్యాపేట సమీపంలోని స్వగ్రామం లో సైనిక లాంఛనాలతో కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు నిర్వహించారు. సంతోష్ పార్థివదేహాన్ని ఆర్మీ అధికారులు చితివద్దకు తీసుకువచ్చారు. పార్థివదేహం చితి చుట్టూ కుటుంబసభ్యులు మూడు సార్లు తిరిగారు. వీరజవాన్ కు నివాళిగా జవాన్లు గాల్లోకి మూడుసార్లు తూటాలు పేల్చి.. గౌరవ వందనం సమర్పించారు. ఆపై సంతోష్ బాబు సతీమణి, కుమారుడు, బంధువులు, ప్రజలు సెల్యూట్ చేశారు. సంతోష్ బాబు చితికి తండ్రి ఉపేందర్ నిప్పుపెట్టడంతో అంత్యక్రియలు పూర్తి అయ్యాయి.
అంతకుముందు సూర్యాపేట విద్యానగర్లోని ఆయన స్వగృహం నుంచి కర్నల్ సంతోష్ బాబు అంతిమయాత్ర ఎంజీ రోడ్డు, శంకర్ విలాస్ సెంటర్, రైతు బజార్, పాత బస్టాండ్, కోర్టు చౌరస్తా, ఎస్పీ కార్యాలయం మీదుగా కేసారంలోని వ్యవసాయ క్షేత్రం వరకు కొనసాగింది. దారి పొడవునా వేలాది మంది ప్రజలు భవనాలపై నుంచి పూలు చల్లుతూ నివాళులర్పించారు. స్థానికులు జాతీయ జెండాలు చేతబూని సంఘీభావం ప్రకటించారు. సూర్యాపేటలో వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు.
ఉపాధిహామీ పనులను సందర్శించిన చంద్రారెడ్డి యాదవ్
Tags: Martyr Santosh Babu’s funeral is complete