నూతన ఎస్పీగా మేరీ ప్రశాంతి
ఏలూరు ముచ్చట్లు:
ఏలూరు జిల్లా నూతన జిల్లా ఎస్పీగా మేరీ ప్రశాంతి బుధవారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో, కొత్తగా ఏర్పడిన జిల్లాలో మొట్టమొదటి మహిళా ఎస్పీగా ఆమె ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా చర్యలు చేపడతానని వెల్లడించారు. జిల్లాలో శాంతిభద్రతలు కాపాడడంలోనూ, అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కు పాదం మోపటంలోను ముందుంటాను. చట్టం పరిధిలో పని చేసుకుంటూ వెళుతూ నాకు అప్పగించిన బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వర్తిస్తానని అమె అన్నారు.
Tags; Mary Prashanthi as the new SP

