ముంపు తీవ్రతకు నిలువెత్తు నిదర్శనం మేరీ మీడియా ట్రిక్స్ పాఠశాల      

-దిక్కు తోచని స్థితిలో పాఠశాల సిబ్బంది.
-పాఠశాల రికార్డులన్నీ వరద పాలు

మంథని ముచ్చట్లు:


ఈనెల 13,14వ తేదీల్లో  ప్రాంతాన్ని చుట్టుముట్టిన వరదల్లో తీవ్ర నష్టం సంబంధించింది వరద ముంపుతో అనేక ప్రాంతాల్లో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఇందులో భాగంగా మంథని మండలం సూరయ్యపల్లి గ్రామంలోని మేరీ మీడియా ట్రిక్స్ పాఠశాల పరిస్థితి మరి అద్వాన్నంగా తయారైంది. పాఠశాలలోని రికార్డ్స్ అన్ని ధ్వంసమయ్యాయి. పాఠశాలలోని రికార్డు రూమ్ తో సహా అన్ని గదులు పూర్తిగా నీట మునిగతంతో నష్టం భారీ స్థాయిలో జరిగిందని పాఠశాల నిర్వాహకులు బోరున విలపిస్తున్నారు. వరద నీరు రెండు రోజులు ఉండడంతో టీచర్స్ నివసించే రూముల్లోని బెడ్లు, పరుపులు, వంట సామాగ్రి, ఫ్రిజ్లు తదితర ఉపయోగకరమైన అన్ని వస్తువులు పూర్తిగా నీట మునిగి ధ్వంసం అయ్యాయని పాఠశాల ప్రిన్సిపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పాఠశాల లోని రికార్డ్స్ అన్ని పూర్తిగా పనికిరాకుండా పోయాయని కంప్యూటర్ రూమ్లోని కంప్యూటర్లన్నీ చెడిపోయాయని ప్రిన్సిపల్ ఆవేదన చెందారు. ఇప్పటివరకు ఎవ్వరు కూడా తమ పాఠశాలను సందర్శించలేదని తమకు జరిగిన నష్టానికి ప్రభుత్వం సహాయం అందించాలని వారు కోరారు.

 

Tags: Mary’s school of media tricks is a testament to the severity of the flood

Leave A Reply

Your email address will not be published.