Natyam ad

పుంగనూరులో 4 న మసెమ్మ జాతర ప్రారంభం

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలం ఆరడిగుంట పంచాయతీ కొండచెర్ల కురప్పల్లె గ్రామంలో అత్యంత వైభవంగా శనివారం మసెమ్మ జాతర ప్రారంభంకానున్నది. రెండురోజుల పాటు జరిగే జాతరలో రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. కాగా సుమారు 30 గ్రామాల నుంచి భక్తులు తరలిరానున్నారు. శనివారం రాత్రి అమ్మవారిని ఊరేగింపు చేసి , ఆదివారం ఉదయం భక్తులకు దర్శనం కల్పిస్తారు. అమ్మవారికి జంతుబలులు సమర్పించి , భక్తులు చలిపిండి, దీపాలు వెలిగించి వెహోక్కులు చెల్లించుకుంటారు. ఆరాత్రి అమ్మవారిని ఊరేగింపు చేసి, నిమజ్జనం నిర్వహిస్తారు. గ్రామస్తులు ఏర్పాట్లు చేశారు. సీఐ గంగిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు.

 

Post Midle

Tags; Masemma fair starts on 4th at Punganur

 

Post Midle