Masks for Employees: JEVO Shri P.Basantkumar

ఉద్యోగుల‌కు మాస్కులు త‌ప్ప‌నిస‌రి : జెఈవో పి.బ‌సంత్‌కుమార్‌

Date:04/05/2020

తిరుప‌తి ముచ్చట్లు:

లాక్‌డౌన్‌లో మిన‌హాయింపుల మేర‌కు విధులకు హాజరవుతున్న ఉద్యోగుల‌కు మాస్కులు త‌ప్ప‌నిస‌రి చేశామ‌ని టీటీడీ జెఈవో  పి.బ‌సంత్‌కుమార్ సోమ‌వారం తెలిపారు. పరిపాలనా భవనం ప్ర‌వేశ‌ద్వారం వ‌ద్ద థ‌ర్మోస్కానింగ్ చేయిస్తున్నామన్నారు. ఉద్యోగులు భౌతిక‌దూరం పాటించేలా ఆదేశాలు జారీ చేశామ‌ని, అధికారులు, ఉద్యోగులు ఒక చోట చేరేలా స‌మావేశాలు నిర్వ‌హించ‌డం లేద‌ని వివ‌రించారు. అవసరమైతే డిజిటల్ సమావేశాలు జరుపుతున్నామని చెప్పారు.ప్ర‌భుత మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు విభాగాధిప‌తులు, శాఖాధిప‌తులు అంద‌రూ విధుల‌కు హాజ‌ర‌వుతున్నార‌ని చెప్పారు. ఆల‌యాల్లోని అర్చ‌క‌, ఇత‌ర సిబ్బంది, ట్రెజ‌రీ, అకౌంట్స్‌, ఆరోగ్య విభాగం, భ‌ద్ర‌త విభాగాల సిబ్బంది 100 శాతం హాజరవుతున్నారని ఆయన వివ‌రించారు. ఇత‌ర విభాగాల్లో అవ‌స‌రాన్ని బ‌ట్టి 33 శాతం సిబ్బంది కార్యాల‌యాల‌కు హాజ‌ర‌వుతున్నార‌ని, ఇత‌ర సిబ్బంది ఇళ్ల వ‌ద్ద నుండే విధులు నిర్వ‌హిస్తున్నార‌ని తెలియ‌జేశారు.

లాక్ డౌన్ వేళ వివాహేతర సంబంధాలు

Tags: Masks for Employees: JEVO Shri P.Basantkumar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *