Masks for Preventing Coronavirus Virus in Srikalahasti

శ్రీకాళహస్తిలో కరోనా వైరస్ అరికట్టడం కోసం మాస్కులు

Date:25/03/2020

శ్రీకాళహస్తి ముచ్చట్లు:

శ్రీకాళహస్తిలో కరోనా వైరస్ ను అరికట్టడం కోసం ఎమ్మెల్యే శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు ఈరోజు శ్రీకాళహస్తి మొత్తం హై క్లోరైడ్ మిశ్రమాన్ని డ్రోన్ ద్వారా (“డ్రోన్ సనిటైజర్”) నగరం అంతట స్పై చేయించారు.

 

అనంతరం ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు తానే స్వయంగా నాలుగు మాడ వీధుల్లో తిరిగి మాస్కులు ధరించి లేని వారిని హెచ్చరించారు ,అలాగే ప్రజలందరినీ ఇంటి నుండి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ,నిన్న చిత్తూరు జిల్లాలో కరోనా మొదటి కేసు మన శ్రీకాళహస్తిలో బయట పడడం చాలా బాధాకరం కానీ ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందంతా ఒకటే దయచేసి మీ ఇంటి నుండి బయటకు రాకండి అలాగే మీకు ఎవరి మీద అనుమానం కలిగినా అలాగే మీ చుట్టూ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా వెంటనే మా నెంబర్ 104 కు తెలియజేయండి.

 

నాకు ఒకటే బాధ కరోనా వైరస్ ఇంతలా వ్యాప్తి చెందడానికి కారణం చదువుకున్న వాళ్ళే, చదువు కోసం బయట దేశాలకు వెళ్లి తిరిగి వస్తున్న మీకు కొంచెం కూడా బాధ్యత లేకుండా ప్రవర్తించి కనీసం డాక్టర్ దగ్గరికి వెళ్లి చూపించుకో వాలన్నా విజ్ఞత కూడా లేకుండా ఈరోజు కరోనా వైరస్ ఇంతలా వ్యాప్తి చెందేలా చేశారు.

 

మన ప్రాణాలు మనం కాపాడుకోవాలి కరోనాకు మిస్టర్ డాక్టర్ పోలీస్ అందరూ ఒకటే మన ప్రాణం మన చేతుల్లోనే ఉంది.

 

మన ముఖ్యమంత్రి జగన్ అన్న గారు ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి జాగ్రత్తగా ఉండండి అని వేడుకుంటున్నారు మరోపక్క ప్రధానమంత్రి మోడీ గారు వేడుకుంటున్నారు. అలాగే మన కలెక్టర్ గారికి నిన్న సీఎం జగన్ అన్న గారు అలాగే బొత్స సత్యనారాయణ గార నాలుగు సార్లు కాల్ చేసి శ్రీకాళహస్తి పరిస్థితి గురించి ఆరా తీశారు.

 

మన వాలంటీర్లు

,డాక్టర్లు,పోలీసులు,మున్సిపల్ సిబ్బంది,మీడియా వాళ్లు దేవుళ్ళతో సమానం ఎందుకంటే ఒక టీచర్ లాగా ప్రతి ఒక్కరికి జాగ్రత్తలు చెప్తూ ధైర్యం చెబుతూ వెళ్తున్నారు.

 

మన చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు ఆయన పడుతున్న కష్టం ఒక కలెక్టర్ గా కాకుండా ఒక కార్మికుడిగా కరోనా వైరస్ను అరికట్టడం కోసం రాత్రనకా పగలనకా ప్రతి ఒక్క శాఖల వారితో మాట్లాడుతూ పని చేస్తున్నారు.

 

చైనా అమెరికా ఇటలీ వంటి దేశాలే కరోనా వైరస్ను అరికట్టడంలో విఫలం అయినాయి ఇంత జరిగినా కూడా మన వాళ్ళకి భయం రాలేదు.

 

శ్రీకాళహస్తిలో ప్రతి ఒక్కరు ఒక పోలీసుల ,ఒక డాక్టర్ల లాగా తయారవ్వాలి ఇప్పుడు కాపాడుకో లేకుంటే ఇంకెప్పటికీ కాపాడుకోలేము.

 

మన శ్రీకాళహస్తి ప్రజలకు ఒకటే చెప్తున్నా ఎవరైనా వారం నుండి పది రోజుల నుండి దగ్గుతున్న విదేశాలనుండి వచ్చినవాళ్లు ఉన్న మాకు మెసేజ్ ఇవ్వండి. ఒకవేళ మెసేజ్ ఇవ్వలేకపోతే మీరే ఒక డిఎస్పి లాగా సీ.ఐ లాగా ఎస్.ఐ లాగా మాస్కులు లేకుండా తిరుగుతున్న వాళ్ల తాట తీసేయండి.

అలాగే యువతరం సేవా సమితి మెంబర్స్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు మీరు చేస్తున్న సర్వీస్ కు హ్యాట్సాఫ్.

 

అలాగే హైదరాబాద్ నుండి లక్ష మాస్కులు ,సనిటైజర్ వస్తున్నాయి అలాగే హోమియోపతి మందులు కూడా మరో రెండు రోజుల్లో పంపిణీ చేస్తాం.

 

నా బాధ్యత అడుగుతున్నా ఇప్పుడు మనం జాగ్రత్త పడాలి మన ప్రాణాలు మన చేతుల్లోనే ఉన్నాయి. యముడికి అందరూ ఒకటే దయచేసి శ్రీకాళహస్తి ప్రజల కాళ్లు పట్టుకొని వేడుకుంటున్నాను ఎవరు ఇంటి నుండి బయటకు రాకండి అన్నారు.

గ్రామంలోనికి ఎవరు రాకుండ రహదారికి కంపలు

Tags: Masks for Preventing Coronavirus Virus in Srikalahasti

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *