మసూద్‌ అజార్‌ ఆస్తుల జప్తు

   Date:15/03/2019
 పారిస్‌  ముచ్చట్లు
 జైషే మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్‌ అజార్‌ ఆస్తులను జప్తు చేసే దిశగా ఫ్రాన్స్‌ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందుకు సంబంధింది శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఫ్రాన్స్‌లోని ఆర్థిక, ఇంటీరియర్‌, విదేశీ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఈ ప్రకటనను విడుదల చేశాయి. ఉగ్రవాద చర్యలకు పాల్పడిన వ్యక్తిగా మసూద్‌ అజార్‌ను అభివర్ణిస్తూ అతడికి సంబధించిన ఆస్తులను గుర్తించి వాటిని జప్తు చేయాలని ఫ్రాన్స్‌ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపింది. ఉగ్రవాదాన్ని ఫ్రాన్స్‌  తేలిగ్గా తీసుకోదని, ఉగ్ర కార్యకలాపాలు సాగించే వాళ్లకు గట్టిగా బుద్ధి చెబుతుందని ఫ్రాన్స్‌ పేర్కొంది.‘ భారత్‌లో 14 ఫిబ్రవరి 2019న భయంకరమైన దాడి చోటు చేసుకుంది. ఈ ఘటనలో 40 మంది భారత భద్రతా దళాలు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి ముమ్మాటికి జైషే మహమ్మద్‌ సంస్థే కారణమని, ఈ సంస్థ వల్ల ప్రమాదముందని ప్రపంచ దేశాలు విశ్వసిస్తున్నాయి. జైషే సంస్థ ఉగ్రవాదానికి చెందిన సంస్థగా ఐరాస 2001లోనే గుర్తించింది. దీన్నే ఫ్రాన్స్‌ అనుసరిస్తోంది ’ అని ఫ్రాన్స్ ప్రభుత్వం ఆ ప్రకటనలో తెలిపింది.
పుల్వామా ఆత్మాహుతి దాడికి పాల్పడింది తామేనంటూ జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జైషే అధినేత మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఫ్రాన్స్‌, బ్రిటన్‌, అమెరికాలు ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో ఫిబ్రవరి 27న ప్రతిపాదించాయి. శాశ్వత సభ్యదేశాలు చేసిన తీర్మానంపై భద్రతా మండలి ఆంక్షల కమిటీ 10 రోజులు గడువు విధించింది. దీనిపై రెండు చర్చ జరగ్గా చివరి నిమిషంలో చైనా అడ్డు చెప్పింది. మసూద్‌ విషయంలో విచారణ జరపడానికి తమకు మరింత సమయం కావాలని కోరింది.
Tags:Masood Azar confiscated property

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *