కాళికామాత ఆలయం లో సోమవారం కార్తీక మాసం సందర్భంగా సామూహిక కేదారేశ్వర వ్రతం

కాళికామాత ఆలయం లో సోమవారం కార్తీక మాసం సందర్భంగా సామూహిక కేదారేశ్వర వ్రతం
ఆళ్లగడ్డ

తెలంగాణ ముచ్చట్లు:

 

 

ఆళ్లగడ్డ స్థానిక  విశ్వరూప పారిశ్రామిక నగర్ లో వెలసిన శ్రీ శ్రీ శ్రీ కాళికామాత ఆలయం లో సోమవారం కార్తీక మాసం సందర్భంగా సామూహిక కేదారేశ్వర వ్రతం, నోములు బ్రహ్మంగారిమఠం ఆస్థాన సిద్ధాంతి పోలేపల్లి రామబ్రహ్మం సిద్ధాంతి, ఆలయ ప్రధాన అర్చకులు విల్లనూరు చంద్రశేఖర ఆచారి చేత శాస్త్రో క్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్తీక వన సమారాధన  ఆలయ కమిటీ వారు పెద్ద ఎత్తున నిర్వహించారు. అనంతరం ఆలయ నూతన మహిళా కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు శిల్పి దురుగడ్డ రవీంద్రాచారి ఆధ్వర్యంలో మొత్తం 20 మంది  మహిళా సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన అధ్యక్షురాలుగా దురుగడ్డ అనురాధ,  ఉపాధ్యక్షురాలుగా దురగడ్డ సావిత్రమ్మ, బాణాల గోవిందమ్మ. ప్రధాన కార్యదర్శిగా విశాలాక్షి,మరియు కార్యదర్శులుగా పద్మావతి, జ్యోతి, వీరభద్రమ్మ, వెన్నెలశ్రీ కమిటీ సభ్యులుగా ఉమాదేవి. విజయ. జ్యోతి. గాయత్రి తదితరులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు  రవీంద్రాచారి, ఉపాధ్యక్షుడు విజయ్ కుమార్ ఆచారి  రామాచారి నూతన సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన అధ్యక్షురాలుగా ఎంపికైన దురుగడ్డ అనురాధ మాట్లాడుతూ విశ్వరూప నగర్ లో వెలసిన శ్రీ కాళికామాత ఆలయం దినదిన అభివృద్ధి చెందుతున్నదని ఈ ఆలయ అభివృద్ధికి తమ శాయశక్తుల  కృషి చేస్తామని అన్నారు. తమపై నమ్మకంతో అమ్మవారికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన ఆలయ కమిటీ అధ్యక్షుడు శిల్పి రవీంద్ర చారి కి, కమిటీ సభ్యులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి అభివృద్ధి అధికారి KRM మల్లిక్, ఆళ్లగడ్డ ప్రభుత్వ  డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ గంగన్న , విశ్వబ్రాహ్మణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

 

 

Tags:Mass Kedareswara Vrat on the occasion of Kartika month in Kalikamata temple on Monday

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *