మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల, త్రినాధరావు నక్కిన, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం “ధమాకా” మొదటి సింగిల్ జింతాక్ లిరికల్ వీడియో విడుద‌ల‌

హైదరాబాద్ ముచ్చట్లు:

మాస్ మహారాజా రవితేజ న‌టిస్తున్న తాజా చిత్రం “ధమాకా” టైటిల్ ప్రకటించినప్పటి నుండే ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి నెల‌కొంది. దర్శకుడు త్రినాధ రావు నక్కిన తో యాక్షన్ ఎంటర్టైనర్‌ గా రూపొందుతోన్న ఈ చిత్రం ఇండ‌స్ట్రీలో చాలా క్యూరియాసిటీని రేకెత్తించింది. ఆ తర్వాత విడుద‌లైన రవితేజ, శ్రీలీల ఇద్దరి ఫస్ట్ లుక్ ఆసక్తిని మరింత పెంచింది. ఈ రోజు, చిత్రంలోని  మొదటి సింగిల్ `జింతాక్`  లిరికల్ వీడియోను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. మంచి చార్ట్‌బస్టర్ గా సంగీత ద‌ర్శ‌కుడు  భీమ్స్ సిసిరోలియో ఒక సామూహిక, జానపద-నృత్య రీతితో ముందుకు వచ్చారు. బీట్స్ అన్నీ స‌రికొత్త‌గా పెప్సీగా ఉన్నాయి. బాణీలు కంపోజ్ చేయడంతో పాటు, భీమ్స్ సిసిరోలియో పాటకు గాత్రాన్ని కూడా అందించారు. ఈ రకమైన పాటలకు ప్రైమ్ ఛాయిస్ అయిన మంగ్లీ కూడా గొంతు క‌లిపారు. గాయకులు ఇద్దరూ తమ చురుకైన గానంతో పాట‌కు ఎనర్జీ చేకూర్చారు. రవితేజ, శ్రీలీల మాస్ డ్యాన్స్‌లు ఈ పాటకు పెద్ద ఆకర్షణగా నిలిచాయి.  మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే పర్ఫెక్ట్ ఫోక్ సాంగ్ అన‌డంలో మ‌రోమాట‌కు తావులేదు. ఇద్ద‌రూ తమ ఆకర్షణీయమైన డ్యాన్స్‌లతో మరింత ఉత్సాహాన్ని జోడించారు.  విజువల్స్ వైబ్రెంట్‌ గా ఇచ్చిన సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని ‌కు చిత్ర యూనిట్ థ్యాంక్స్ చెబుతోంది.
నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో ధమాకాను నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత.
‘డబుల్ ఇంపాక్ట్’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ధమాకాలో ప్రముఖ నటీనటులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు ప‌నిచేస్తున్నారు.  ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే మరియు సంభాషణలు అందించగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు.
తారాగణం: రవితేజ, శ్రీలీల

 

Tags: Mass Maharaja Ravi Teja, Srileela, Trinadha Rao Nakkina, People Media Factory Movie “Dhamaka” First Single Jintak Lyrical Video Release

Leave A Reply

Your email address will not be published.