పుంగనూరులో నౌవ్‌జవాన్‌ కమిటిచే సామూహిక వివాహాలు 

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని ముస్లింలకు చెందిన నౌవ్‌ జవాన్‌ కమిటి సభ్యులు అయూబ్‌, అఫ్సర్‌ ల ఆధ్వర్యంలో గురువారం సామూహిక వివాహాలు నిర్వహించారు. పట్టణంలోని యువజంటలకు వివాహాలు నిర్వహించి, వారికి కమిటి ఆధ్వర్యంలో బట్టలు, నిఖా సర్టిపికెట్లు పంపిణీ చేశారు. అలాగే అనేక మందికి బహుమతులు అందజేశారు. కాగా గత మూడు సంవత్సరాలుగా నౌవ్‌ జవాన్‌ కమిటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, కౌన్సిలర్‌ అర్షద్‌అలి,  కమిటి సభ్యులు ఇమ్రాన్‌, అల్తాఫ్‌, సిద్ధిక్‌, అఫ్రోజ్‌, ఫిద్రోస్‌, ముభారక్‌, షాన్‌వాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags: Mass marriages by Nauvjawan Committee in Punganur

Leave A Reply

Your email address will not be published.