ఆజాదీ క అమృత మహోత్సవ సందర్బంగా సాముహిక శ్రీమంతాలు

యదాద్రి భువనగిరి ముచ్చట్లు:


ఆజాదీ క అమృత మహోత్సవ కార్యక్రమంలో భాగంగా శ్రీ పాల కుర్ల శివయ్య గౌడ్ స్మారక పౌండేషన్ ఆధ్వర్యంలో 20 మంది మహిళలకు సాముహిక శ్రీమంత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ ప్రియాంక హాజరై గర్భిణీ స్త్రీల ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నార్మల్ డెలివరీ ప్రోత్సహించి వారికి వ్యాయామం చేయటం గురించి చెప్పారు. ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ నార్మల్ గా మరియు ఆరోగ్యవంతమైన నా బిడ్డను కనాలని బోధించారు. మృత శిశు మరణాలు తగ్గించాలని, అంగన్వాడీలో అదనపు ఆహారం తీసుకోవాలని పండంటి బిడ్డను కనాలని ప్రోత్సహించారు. ప్రతి తల్లి డెలివరీ కాగానే మురిపాలు పటించాలి అని చెప్పారు. తల్లికి వచ్చిన రెండు చుక్కల ముర్రిఆ పాలలో 178 పోషకాలు ఉంటాయని మరియు వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉంటుందని వివరించారు.

 

 

బిడ్డకు ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే అన్నారు. ఆరు నెలల తర్వాత అదనపు ఆహారం అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో అతిథిలుగా పాల్గొన్నబాలకృష్ణ అరుణ, బత్తుల శ్రీశైలం, పోలోజు శ్రీధర్ బాబు హాజరై గర్భిణీ స్త్రీలకు అంగన్వాడీ కేంద్రాలకు తమ వంతు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. సృష్టికి  తల్లులే మూలమని, తల్లి మొదటి గురువు అని వివరించారు. బిసి కాలని పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ నిర్వాహకులు పాలకొల్లు భాను అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే పుష్పలత, అంగన్వాడి టీచర్ ఐలమ్మ, పరేహెన్  సుల్తానా,సంధ్య రాణి ,రోహెన్ సుల్తానా  తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Mass Shrimanthalu on the occasion of Azadi Ka Amrita Mahotsava

Leave A Reply

Your email address will not be published.