Natyam ad

కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో వీనులో విందుగా సామూహిక జాతీయ గీతాలాపన

భద్రాద్రి కొత్తగూడెం ముచ్చట్లు:

భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలలో భాగంగా  కొత్తగూడెం పట్టణం ప్రకాశం స్టేడియంలో వీనుల విందుగా ఉదయం 11:30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భారత స్వాతంత్ర 75వ వజ్రోత్సవ వేడుకలను 15 రోజుల నుండి ఒక పండుగలా నిర్వహించుకోవడం ఎంతో ఆనందదాయకమన్నారు. సామూహిక గీతాలాపనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అభినందించారు. కార్యక్రమానంతరం జిల్లా ఎస్పీ వినోద్ జి ఐపీఎస్ విద్యార్థినీ విద్యార్థులకు ఒకరోజు సెలవు మంజూరు చేయాలని కలెక్టర్ అనుదీప్ ను రిక్వెస్ట్ చేసారు. ఈ మేరకు కలెక్టర్ సంతోషంగా స్పందిస్తూ మధ్యాహ్నం భోజనానంతరం  విద్యార్థులకు సెలవు మంజూరు చేయాలని డిఇఓ ని ఆదేశించారు.

 


 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి,జిల్లా ఎస్పీ డా.వినీత్.జి,జెడ్పి చైర్ పర్సన్ కోరం కనకయ్య ,డిఎస్పీ వెంకటేశ్వర బాబు, డిఆర్ఓ అశోక చక్రవర్తి, ఆర్డిఓ స్వర్ణలత, వార్డు కౌన్సిలర్లు కౌడ గాని పరమేష్ యాదవ్, ఇతర కౌన్సిలర్లు, భాజపా జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్,  ఇతర అధికారులు,ప్రజా ప్రతినిధులు,విద్యార్థులు బారీ సంఖ్యలో పాల్గొని సామూహిక జాతీయ గీతాలపనను విజయవంతం చేశారు. ఒకటవ పట్టణ సిఐ, తదితర పోలీస్ సిబ్బంది భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించా

 

Tags: Mass singing of National Anthem at Kothagudem Prakasam Stadium in Veenu

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.