మధురానగర్ చౌరస్తాలో నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపన

చొప్పదండి ముచ్చట్లు:75వ భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా దేశ సమైక్యతను దేశభక్తిని దశ దిశల చాటి చెప్పడానికి స్వాతంత్ర్య సమరయోధుల స్మరించుకోవడానికి దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమం పురస్కరించుకొనికరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధుర నగర్ చౌరస్తాలో గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు అధికారులు విద్యార్థులు వివిధ పాఠశాల ఉపాధ్యాయులు యువకులు మహిళలు మహిళా సంఘాల నాయకులు పలు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తూ జాతీయ గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా సురభి విద్యానికేతన్, శ్రీ వివేకానంద విద్యాలయం, తేజస్విని జూనియర్ కళాశాల, పలు ప్రైవేటు పాఠశాల విద్యార్థనీ విద్యార్థులు జాతీయ జెండాను ర్యాలీగా నిర్వహిస్తూ పట్టుకొని మధుర నగర్ చౌరస్తా వరకు వచ్చి జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీరామ్ మధుకర్, తహసిల్దార్ శ్రీనివాస్ గౌడ్, ఎం పి డీ వో, ఎస్సై రాజు పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు పోలీస్ సిబ్బంది గ్రామస్తులు తదితర మహిళా సంఘాల నాయకులు అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు.

 

Tags: Mass singing of National Anthem at Maduranagar Square

Leave A Reply

Your email address will not be published.