75 జిల్లాల్లో సామూహిక వ్యాప్తి

Date:09/05/2020

న్యూఢిల్లీ ముచ్చట్లు:

దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న బాధితుల రేటు పెరుగుతుందని కేంద్రం ప్రకటించింది. పాజిటివ్ కేసులు పెరుగుతున్నా పెద్ద సంఖ్యలో బాధితులు కోలుకోవడం కొంత ఊరట కలిగించే అంశందేశంలో కరోనా వైరస్ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. గత వారం రోజుల నుంచి రోజూ సగటున 3వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదుకావడంతో సామూహిక వ్యాప్తిలోకి మహమ్మారి ప్రవేశించిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా 75 జిల్లాల్లో పెద్ద సంఖ్యలో కేసులు నమోదు కావడంతో అక్కడ అధ్యయనం నిర్వహించాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) భావిస్తోంది. కరోనా వ్యాధి వ్యాప్తిని నియంత్రించే చర్యల్లో ప్రతి జిల్లా నుంచి తీవ్రమైన తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యం‌, ఇన్‌ఫ్లూయోంజా వంటి అనారోగ్యంతో బాధపడుతున్న కనీసం 250 మందికి పరీక్షలు నిర్వహించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరింది.తొలి దశ అధ్యయనంలో తర్వగా ఫలితాలు వచ్చే యాంటీబాడీ టెస్ట్ కిట్ల ద్వారా పరీక్షలను నిర్వహించాలని ఐసీఎంఆర్ భావించినట్లు అధికారులు తెలిపారు.

 

 

 

అయితే, ఈ కిట్‌లను వినియోగించినప్పుడు ఫలితాలలో వ్యత్యాసం ఉండటంతో వాయిదా పడింది. ప్రస్తుతం ఎలిసా (ఎంజైమ్-లింక్డ్ ఇమ్యునో సోర్బెంట్ అస్సే) టెస్ట్ కిట్‌లను ఉపయోగించాలని యోచిస్తోంది.రక్తంలో ప్రతిరోధకాలను గుర్తించడంలో ఎలిసా టెస్ట్ కిట్.. యాంటీబాడీ టెస్ట్ కిట్‌తో సమానంగా ఉంటుంది. కానీ ఈ కిట్‌లను ఐసిఎంఆర్ ఇంకా ధ్రువీకరించలేదు. కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ దశలోకి ప్రవేశించిందా? అనే అంశం ఐసిఎంఆర్ మార్చిలో ఇలాంటి అధ్యయనాలు నిర్వహించింది. కానీ సామూహిక వ్యాప్తికి తగిన ఆధారాలు అప్పుడు లభించలేదని తెలిపింది.జులై నాటికి దేశంలో కరోనా వైరస్ విజృంభణ స్థాయికి చేరుకుంటుందంటూ కొంత మంది ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ..

 

 

 

ఈ అంశంపై మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ లవ్ అగర్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనలు, జాగ్రత్తలను పాటించకపోతే కరోనా కేసులు పెరుగుతాయని హెచ్చరించారు. స్వీయ నియంత్రణ చర్యలను తూ.చ. తప్పకుండా పాటించినప్పుడే వైరస్ వ్యాప్తి అదుపులో ఉంటుందని చెప్పారు. లేకపోతే కరోనాతో కలిసి జీవించడమెలాగో నేర్చుకోవాలని వ్యాఖ్యానించారు.

యాంటీ బాడీస్ తయారీలో భారత్

Tags: Mass spread in 75 districts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *