కరోనా లాక్ డౌన్‌లో భారీగా గృహహింస కేసులు నమోదు

హైదరాబాద్ ముచ్చట్లు :

కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్‌లో గృహహింస కేసులు భారీగా నమోదవుతున్నాయి. 13 రోజుల్లోనే డయల్ 100కు ఎక్కువ ఫోన్ కాల్స్ వచ్చాయి. గృహహింసకు గురవుతున్నావారు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చునని అదనపు డీజీ స్వాతి లక్రా అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లాక్‌డౌన్‌ వల్ల అందరూ ఇంట్లోనే ఉంటున్నారని ఈ నేపథ్యంలో గృహహింసలు జరుగుతున్నాయని, అలాంటి వాటిపై తమకు వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహిళలకు ఏమైన ఆదప వచ్చినా, గృహహింస జరిగినా వెంటనే 100కు ఫోన్ చేయాలని సూచించారు. తక్షణమే పోలీసులు స్పందిస్తారన్నారు. ఇంకా షీ టీమ్స్ కూడా పనిచేస్తున్నాయని స్వాతి లక్రా తెలిపారు. కరోనా మహమ్మారి, లాక్ డౌన్ కాలంలో సైబర్ నేరాలు కూడా పెరిగాయన్నారు. ఇలాంటి సమయంలో మహిళలు బయటకు రాకుండా వెంటనే 100కు ఫోన్ చేయవచ్చునని, లేదా షీ టీమ్స్ కూడా తెలియజేయవచ్చునని స్వాతి లక్రా అన్నారు.

 

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

Tags:Massive domestic violence cases registered in Corona lockdown

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *