సీరం ఇన్స్టిట్యూట్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం

Date:21/01/2021

పూణే  ముచ్చట్లు:

పూణేలోని పూణేకరోనా వ్యాక్సిన్ తయారీదారు సంస్థ అయిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సీరం సంస్థ మాంజ్రీ ప్లాంట్లోని టెర్మినల్-1 గేట్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది. ఈ విషయం తెలియగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.ఇకపోతే ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఆక్స్ఫర్డ్ ఆస్ట్రా జెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను సీరం భారీ ఎత్తున తయారు చేస్తున్న సంగతి తెలిసిందే.  అయితే  కోవీషీల్డ్ టీకాలు ప్రమాదం జరినగిన ఈ ప్లాంట్ లో తయారుకావడం లేదని తెలుస్తుంది. మొదట్లో ఐదు అగ్ని మాపక యంత్రాలు మాత్రమే చేరుకున్నాయి. మంటలు  అదుపు కాకపోవడంతో అధికారులు మరో ఐదు అగ్ని మాపక యంత్రాలను రప్పించారు.

పుంగనూరులో జగనన్న కాలనీలో లబ్ధిదారులకు పట్టాలపై పరిశీలన

Tags: Massive fire at the Serum Institute Center

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *