Natyam ad

విశాఖ ఫిషింగ్ హర్బర్లో  భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ ముచ్చట్లు:


విశాఖ ఫిషింగ్ హార్బర్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం 11:30గంటల ప్రాంతంలో  జెట్టీల వద్ద ఆగిఉన్న బోట్లలో భారీ మంటలు చేలరేగాయి. సుమారు 60 బోట్లకు మంటలు వ్యాపించాయి. గ్యాస్ సిలిండర్లు, డీజల్ ట్యాంకుల ప్రేలుళ్ళ కారణంగా అగ్ని కీలలు  వేగంగా వ్యాపించాయి. విశాఖ పోర్ట్ అథారిటీ నుంచి ప్రత్యేక అగ్నిమాపక నౌక ద్వారా మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసారు. మొదటి ఒక బోటుతో చెలరేగిన మంటలు చివరకు నలభూ పడవలకు బూడిద చేసాయి. ఒక్కో బోటు ఖరీదు 40 నుంచి 50 లక్షలు వుంటుందని సమాచారం. కోట్ల రూపాయల ఆస్తి నష్టంతో పాటు, వందలాది మత్స్యకార కుటుంబాలు జీవనాధారం కోల్పోయాయి. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే పడవలకు నిప్పు పెట్టారని స్థానిక మత్స్యకారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బోటులు కాలిపోవడంతో బోట్లు యజమానులు కన్నీరు మున్నీరవుతున్నారు.

 

Tags: Massive fire in Visakhapatnam fishing harbour

Post Midle
Post Midle