గోదాంలో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్ ముచ్చట్లు:
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధి వి ఎస్ టి లోని అన్నపూర్ణ బార్ సమీపంలోనీ ఓ గోదాం లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు దట్టమైన పొగలతో ఎగిసిపడ్డాయి. దాంతో స్థానికులు చిక్కడపల్లి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి సమీపంలోనే ఫైర్ స్టేషన్ వుంది. సమచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసారు. మంటలు, పోగ వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురైయారు. ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. గోదాం లో ఓ కంపెనీకి చెందిన కేబుల్ వయర్స్ & ప్లాస్టిక్ మెటీరియల్ కు నిప్పు అంటుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసుల అనుమానిస్తున్నారు.
ఘటనాస్థాలాన్ని మంత్రి తలసానిక శ్రీనివాస్ యాదవ్, స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ పరిశీలించారు.
మంత్రి మాట్లాడుతూ తగిన జాగ్రత్తలు పాటించని వ్యాపారులు, గోదాముల నిర్వహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇలాంటి ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై ఇటీవల ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ప్రజలలో అవగాహన కల్పించే విధంగా విస్తృత ప్రచారం కల్పిస్తున్నాం. తగిన జాగ్రత్తలు పాటించని కారణంగానే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారులు సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారని అన్నారు.

Tags: Massive fire in warehouse
