నిజామాబాద్ లో మాస్టర్ ప్లాన్ కష్టాలు

నిజామాబాద్ ముచ్చట్లు:

ప్రజాభిప్రాయ సేకరణ లేని మాస్టర్ ప్లాన్ తో కష్టాలు.ఫుట్ పాత్ లాంటి వ్యవస్థ కూడా లేక పోవడం,47 సంవత్సరాల తర్వాత తయారు చేస్తున్న మాస్టర్ ప్లాన్ అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ప్రజాభీష్టం మేరకు ముందస్తు చూపుతో మాస్టర్ ప్లాన్ ని రూపొందించాలని, ప్రజలకు సౌకర్యంగా ఉండాలి,నిజామాబాద్ మాస్టర్ ప్లాన్ తో ప్రజల కష్టాలపై ప్రత్యేక కథనం.
నిజామాబాద్  నగర జనాభా సుమరు మూడు లక్షలకు పైగా నివసిస్తున్న పెద్ద నగరం.60 డివిజన్లతో కూడుకున్న నగరం.నిజామాబాద్ మాస్టర్ ప్లాన్ చాలా అవసరమని, ప్రజల సంక్షేమానికి మాస్టర్ ప్లాన్ ఎంతో దోహదపడుతుందని, అది ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా వారి భాగస్వామ్యం ద్వారా మెరుగైన ఫలితాలు ఇస్తుందని,హైదరాబాదులో హెచ్ఎండిఏ పరిధిలో ప్రతీ డివిజన్ నందు మాస్టర్ ప్లాన్ తయారీకి సంబంధించిన, స్థానిక ప్రజలతో, పౌర సమాజంతో డివిజన్ల వారీగా చర్చించినట్లు ఇది అనేక పర్యాయాలు జరిగిందని అన్నారు.హైదరాబాద్ పరిధిలో నేడు మాస్టర్ ప్లాన్ అస్తవ్యస్తంగా ఉండడంతో అనేక కాలనిలు నీట మునుగుతు న్నాయని, ప్రజలు అనేక ఇబ్బందులను ఆరోగ్య సమస్యలను ఎదుర్కొం టున్నారు అని అన్నారు. ఫుట్ పాత్ లాంటి వ్యవస్థ కూడా లేకపోవడం వలన నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అనేక దుష్పరిణామాలను ప్రజలు ఎదుర్కొంటున్నారని, అలాంటి దుష్పరిణామాలు నిజామాబాద్ నగరంలోని ప్రజలు ఎదుర్కోకుండా ఉండేవిధంగా ప్రజాభీష్టం మేరకు ముందస్తు చూపుతో మాస్టర్ ప్లాన్ ని డిమాండ్ చేస్తున్నారు.

 

 

 

నిజామాబాద్ నగర మాస్టర్ ప్లాన్ కూడా డివిజన్ల వారీగా ప్రజలతో పౌర సమాజంతో చర్చించాలి,47 సంవత్సరాల తర్వాత తయారు చేస్తున్న మాస్టర్ ప్లాన్ అన్ని వర్గాల ప్రజలకు ఆమోద యోగ్యంగా ఉండేందుకు తక్షణమే మున్సిపల్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ పార్టీల, పౌర సంఘాలతో చర్చించి వారి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని ముందుకుపోవాలని స్థానికులు కోరుతున్నారు.నిజామాబాద్ నందు 1974 సంవత్సరంలో పొందుపరిచిన రింగ్ రోడ్డు హైదరాబాద్ రోడ్డు నుండి వర్ని రోడ్డు వరకు అక్కడ నుండి బోధన్ రోడ్డు వరకు దాదాపు ఎనిమిది కిలోమీటర్లు ఉందని అందులో మాస్టర్ ప్లాన్ లో వర్ని రోడ్డు నుండి 4.7 కిలోమీటర్లు రద్దు చేసి, గాయత్రి నగర్ నుండి వర్నిరొడ్ వరకు ఉంచటం ఎంత వరకు సమంజసమని,ఇది బైపాస్ రోడ్డు ఎలా అవుతుందని, తాజాగా రూపొందిస్తున్న మాస్టర్ ప్లాన్ శాస్త్రీయంగా లేదని ప్రజలతో చర్చించకుండా ఏకపక్షంగా రోడ్లు వెడల్పు చేయడం గానీ, కొత్త రోడ్లను ప్రతిపాదించడం సరైనది కాదని, మాస్టర్ ప్లాన్ బాధితుల పక్షాన పోరాడతామని బైపాస్ రోడ్డుభాదితుల సంఘం  డిమాండ్ చేస్తుంది.

 

:
నిజామాబాద్ నగరంలోని మైనారిటీ కాలనీలలో అభివృద్ధి అస్తవ్యస్తంగా ఉందని, రోడ్లు, డ్రయినేజీ లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని,మాస్టర్ ప్లాన్ పై జిల్లా అధికారులు తక్షణమే ప్రజలతో చర్చించాలని, నగర మాస్టర్ ప్లాన్ చట్టం కాకముందునే పౌర సమాజంతో, రాజకీయ పార్టీల అభిప్రాయాలు సూచనలు ,సలహాలు తీసుకోవాలని స్థానిక కాలని వాసులు కోరుతున్నారు. ఏళ్ల తరబడి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రజలను మబ్య పెడుతూ అధికారంలోకి వస్తున్న నాయకుల తిరు మరలి.ప్రజలకు మెరుగైన వసతులతో కూడిన మాస్టర్ ప్లాన్ అమలు చేసి ప్రజలకు సౌకర్యంగా ఉండే విదంగా అంతర రహదారులు నిర్మించి ప్రజలకు మంచి పాలనా అందించి నప్పుడే నగరాలూ,పట్టణాలు అభివృద్ధి చెండుతయనేది.ప్రజల అభిప్రాయం.

 

Tags: Master plan difficulties in Nizamabad

Leave A Reply

Your email address will not be published.