Natyam ad

పుంగనూరు మున్సిపాలిటి అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటిని అన్ని విదాలుగా అభివృద్ధి చేసేందుకు మాస్టర్‌ ప్లాన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌ తెలిపారు. సోమవారం కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి, చైర్మన్‌ అలీమ్‌బాషా, జానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణంతో కలసి ఆయన మాస్టర్‌ప్లాన్‌నుపై సమీక్ష నిర్వహించారు. వెంకటరెడ్డి యాదవ్‌ మాట్లాడుతూ పట్టణంలో ఇరవై సంవత్సరాలకొక్కసారి మాస్టర్‌ప్లాన్‌ను పునరుద్దరించనున్నట్లు తెలిపారు. పట్టణం విస్తరిస్తున్న నేపధ్యంలో రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు మాస్టర్‌ప్లాన్‌ను నూతన మార్పులతో ఏర్పాటు చేస్తామన్నారు. పట్టణాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రోడ్లు, వీధులు ఏర్పాటుపై సర్వే నిర్వహిస్తామన్నారు. ప్రజల కోరిక మేరకు మాస్టర్‌ప్లాన్‌ను ఆమోదయోగ్యంగా తయారు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ కిజర్‌ఖాన్‌, టౌన్‌ప్లానింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Master Plan for Development of Punganur Municipality

Post Midle

Leave A Reply

Your email address will not be published.