Natyam ad

మాస్టర్ ప్లాన్ రోడ్డు

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి నగర అభివృద్దే ద్యేయం గా పనిచేస్తున్న నగరపాలక సంస్థ కౌన్సిల్ నిర్ణయాలకు సహకరించి రోడ్డు వెడల్పు పనులకు ముందుకొచ్చిన కొర్లగుంట వాసులు నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీషా, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి లు అభినందించారు.కొర్లగుంట మారుతి నగర్ మెయిన్ రోడ్ విస్తరణ పనులు నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీషా, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, కమిషనర్ అనుపమ అంజలిలు టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు.కొర్లగుంట మారుతి నగర్ ప్రధాన రోడ్డు విస్తరణ జరుగుతున్న సందర్భంగా భవన యజమానులతో కాలినడకన భవన యజమానులతో మమేకమై త్వరితగతిన మెయిన్ రోడ్డు వైడనింగ్ చేయాలని సూచించారు.భవనములు తొలగించిన వెంటనే తిరుపతి నగరము నందు మోడల్ రోడ్డుగా అభివృద్ధి చేస్తామని నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీషా, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి లు తెలిపారు.భవన యజమానులకు త్వరగా టీడీఆర్ బాండ్లు జారీ చేయవలసిందిగా టౌన్ ప్లానింగ్ వారిని ఆదేశించడం అయినది.

 

 

Post Midle

ప్రధాన రహదారి విస్తరణ పనులు మోక్షం కలిగిందన్నారు.ప్రస్తుతం 17 అడుగుల వెడల్పు కలిగిన రహదారిని 40 అడుగులు వెడల్పు చేయడం జరుగుతుందని తెలియజేశారు.యజమానులు స్వచ్ఛందంగా తొలగించుకునేందుకు ముందుకు రావడం చాలా సంతోషమని ఈ సందర్భంగా తెలియజేశారు.కోటి యాభై లక్షల రూపాయల వ్యయంతో కొర్లగుంట మాస్టర్ ప్లాన్ రోడ్డుకు,డ్రైన్ లకు ఇప్పటికే కౌన్సిల్ ఆమోదం తెలిపిందన్నారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కమీషనర్ సునీత, యస్ ఈ మోహన్, కార్పొరేటర్లు నరసింహాచారి, అమర్నాథ్, మాస్టర్ ప్లాన్ రోడ్స్ పొలిటికల్ సమన్వయ కర్త చింతలచెను గోపి, తుడా వెంకట రెడ్డి, ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు..

Tags: Master Plan Road

Post Midle

Leave A Reply

Your email address will not be published.