ఆసియా కప్ నుంచి మ్యాచ్ లు

Match from Asia Cup

Match from Asia Cup

Date:14/09/2018
ముంబై ముచ్చట్లు:
కీలకమైన ఆసియా కప్‌ 2018 టోర్నీ ప్రారంభానికి ముందు శ్రీలంక జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. వేలికి గాయం కారణంగా ఇదివరకే దినేష్ చండిమాల్ సేవల్ని కోల్పోయిన లంక మరో ఆటగాడికి విశ్రాంతి కల్పించింది. ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ దనుష్క గుణతిలక గాయం కారణంగా మొత్తం ఆసియా కప్‌ టోర్నీకే దూరమయ్యాడు. లంక క్రికెట్ బోర్డు గురువారం ఈ విషయాన్ని ప్రకటించింది. మరో 24 గంటల్లో టోర్నీ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆ జట్టుకు ఇది పెద్ద ఎదురుదెబ్బే. అసలే అనుభవం ఉన్న ఓపెనర్లకు లంక జట్టులో కొరత ఉంది.
కొన్ని రోజులుగా దనుష్క వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ఆసియా కప్‌ టోర్నీ ప్రారంభానికల్లా కోలుకుంటాడని భావించిన లంక సెలక్టర్లు అతడికి జట్టులో చోటు కల్పించారు. కానీ, అతడు గాయం నుంచి కోలుకోకపోవడంతో టోర్నీ నుంచి తప్పిస్తున్నట్లు వెల్లడించారు. చండిమాల్ లాంటి సీనియర్ ప్లేయర్ లేకపోవడం, ఆపై ఓపెనర్ గుణతిలక సైతం గాయంతో దూరం కావడం లంకకు ప్రతికూలాంశం. అతడి స్థానంలో మరో లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్‌మన్ షెహన్ జయసూర్యను జట్టులోకి తీసుకున్నారు.
కాగా, ఈ టోర్నీలో పాల్గొనేందుకు ఇప్పటికే ఆరు దేశాల జట్లు యూఏఈ చేరుకున్నాయి. యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న ఆసియా కప్‌ టోర్నీ ఈ నెల 30న ముగియనుంది. మొత్తం ఆరు జట్లు రెండు గ్రూప్‌లగా విడిపోయి తమ అదృష్టాన్నిపరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. గ్రూప్‌-బిలో ఉన్న లంక, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య శనివారం తొలి మ్యాచ్‌ జరగనుంది.
Tags:Match from Asia Cup

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *