పుంగనూరులో వైఎస్‌ఆర్‌ పోషణ ద్వారా తల్లిబిడ్డ క్షేమం

పుంగనూరు ముచ్చట్లు:

 

 

వైఎస్‌ఆర్‌ పోషణ పథకం క్రింద అంగన్‌వాడీల ద్వారా గర్భవతులకు, చిన్నబిడ్డ తల్లులకు, బిడ్డలకు పోషకపదార్థాలను మంగళవారం పట్టణంలో పంపిణీ చేశారు. కౌన్సిలర్లు అమ్ము, రేష్మా కలసి చింతలవీధి, గోకుల్‌వీధి, ఎంబిటి రోడ్డు, కుమ్మరవీధి ప్రాంతాలలో వైఎస్‌ఆర్‌ పోషణ పదార్థాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అమ్ము మాట్లాడుతూ ప్రభుత్వం చిన్నబిడ్డలు, వారి తల్లుల శ్రేయస్సు కాంక్షించి నాణ్యమైన పదార్థాలను అందించడం జరుగుతోందన్నారు. దీని ద్వారా తల్లి,బిడ్డలు ఆరోగ్యవంతులుగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్‌ పీవో భారతి, సూపర్‌వైజర్లు , వర్కర్లు పాల్గొన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Maternal well-being through YSR nutrition in Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *