Natyam ad

కాంట్రాక్టు ఉద్యోగినికీ ప్రసూతి సెలవులు ఇవ్వాల్సిందే: ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ  ముచ్చట్లు:


కాంట్రాక్టు ఉద్యోగినికీ ప్రసూతి సెలవులు ఇవ్వాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు స్పష్టంచేసింది. ప్రసూతి సెలవులను నిరాకరించడం అమానవీయమని పేర్కొంది. కాంట్రాక్టు ఉద్యోగం అనే సాకు చెప్పి సెలవులనునిరాకరించడం ఆమె ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని తెలిపింది.ఢిల్లీ యూనివర్సిటీలో కాంట్రాక్టు పద్ధతిలో సహాయకురాలిగా పని చేస్తున్న ఓ ఉద్యోగిని ప్రసూతి సెలవులు తీసుకోగా.. ఆమెనుయూనివర్సిటీ సర్వీస్‌ నుంచి తొలగించింది. దీనిపై ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ చంద్రధరి సింగ్‌ విచారణ చేపట్టారు. కాంట్రాక్టు ఉద్యోగం అయినంత మాత్రాన నోటీసులు లేకుండాఉద్యో గం నుంచి తొలగించడం చట్టవిరుద్ధమ ని హైకోర్టు పేర్కొంది. వెంటనే ఆమెను సర్వీసులోకి తీసుకొని, నష్టపరిహారంగా రూ.50 వేలు చెల్లించాలని ధర్మాసనం యూనివర్సిటీని ఆదేశించింది.

 

Tags: Maternity leave should also be given to contractual employees: Delhi High Court

Post Midle
Post Midle