-గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఖమర్
Date:11/11/2020
ఖమ్మం ముచ్చట్లు:
భారతరత్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ విద్యారంగానికి చేసిన కృషి ఏన లేనిదని ఖమ్మం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అజీజ్ -ఉల్ -హక్ (ఖమర్ ) అన్నారు.మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతిని గ్రంధాలయంలో బుదవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా ఖమర్ మాట్లాడుతూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇండియా కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ సైన్స్ రీసెర్చ్ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ లాంటి ఎన్నో సంస్థలు మౌలానా మంత్రిగా ఉన్నప్పుడే పురుడు పోసుకున్నాయన్నారు. మౌలానా నేషనల్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అంకురార్పణ సాంకేతిక విద్యకు పెద్ద పీట వేశారని ఆయన విద్యా రంగంలో ఏన్నో మార్పులుకి కృషి చేశారని ఆయన జన్మధినాన్ని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు.స్వాతంత్ర సంగ్రామంలో కీలకపాత్ర పోషించిన వారిలో ఆజాద్ పేరు అగ్రశ్రేణి యోధుల జాబితాలో ఉందన్నారు.జీవితంలోని సింహ భాగమంతా సాహిత్య కృషి కోసం దేశ స్వాతంత్రం కోసమే వెచ్చించారని హిందూ ముస్లిం ఐక్యతను అందించడమే లక్ష్యంగా ఆల్ హిలాల్ పత్రికను నడిపారని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రంధాలయ ఉధ్యోగులు భాస్కర్ అఖిల్ కనకవల్లి విజయ కుమారి రవి తదితురులు పాల్గోన్నారు.
మునిసిపల్ గ్రాంట్ల కింద 581 కోట్ల బకాయిలు విడుదల చేయండి
Tags: Maulana Abdul Kalam Azad’s contribution to education is unparalleled