పుంగనూరు రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమి పాఠశాలలో మౌలనా అబ్ధుల్‌ఖలామ్ ఆజాద్ జయంతి వేడుకలు
పుంగనూరు ముచ్చట్లు:
జాతీయ విద్యా దినోత్సవం పురస్కరించుకుని మౌలనా అబ్దుల్‌కలాం ఆజాద్ జయంతిని పుంగనూరు రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమి పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ కలాం జాతికి అందించిన సేవలు గురించి కొనియాడారు. అనంతరం విద్యావిధానంపై విద్యార్థులకు వకృత్వ పోటీలు నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులుఏసునాథ్, జగదీష్, నాగవేణి, శ్రావణి, రూపేష్ , బాషా, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Tags: Maulana Abdulkhalam Azad Jayanti celebrations at Rayalaseema Children’s Academy School, Punganur
