Natyam ad

మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి మహోత్సవం

పుంగనూరు  ముచ్చట్లు:


జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గూడూరు పల్లి యందు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేష్ నారాయణ  అధ్యక్షతన మౌలానా అబుల్ కలాం ఆజాద్  జయంతి మహోత్సవాలు నిర్వహించడమైనది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ సంపన్న కుటుంబంలో ఆజాద్  నవంబర్ 11 .1888 జన్మించారని ,జాతీయ సమైక్యత మరియు వయోజన విద్యా సాంస్కృతిక ప్రాథమిక విద్యకు పునాదులు వేశారని కొనియాడిరి. ముఖ్యఅతిథిగా మదనపల్లి ఉపవిద్యాధికారికృష్ణప్ప  ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉప విద్యాధికారి జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ 1992లో భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న మొట్టమొదట స్వీకరించిన విద్యాశాఖా మంత్రి ఆజాద్ ని భారతదేశ విద్యాశాఖ మంత్రిగా 11 సంవత్సరాలు పనిచేశారని హిందీ ఇంగ్లీష్ ఉర్దూ అరబిక్ పర్షియన్ బెంగాలీ మొదలగు భాషలలో నిష్ణాతపండితులని క్విట్ ఇండియా ఉప్పు సత్యాగ్రహం మొదలు ఉద్యమాల్లో పాల్గొని 10 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించారని ఫిబ్రవరి 22 1958లో స్వర్గస్తులయ్యారని విద్యార్థులకు తెలియజేయడమైనది. కార్యక్రమంలో ఉపాధ్యాయులు జీ .వీ. రమణ ,రాజేష్, నర్సింహులు, రఘు, అమర్నాథ్ ,శైలజ ,శారద, నారాయణ ,మునిరాజ, మస్తాన్ ,ప్రకాష్ రావు, విద్యార్థులు ,గ్రామస్తులు పాల్గొన్నారు.

 

Tags: Maulana Abul Kalam Azad Jayanti Celebration

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.