మ్యాక్సీ వ్యాన్ బోల్తా… పలువురికి తీవ్ర గాయాలు
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం అనుపల్లి గ్రామం నుండి మ్యాక్సీ వ్యాన్లు సుమారు 40 మంది ప్రయాణికులను తరలిస్తుండగా వాహనం అతివేగంగా వెళ్లడం వల్ల అదుపుతప్పి బోల్తా పడింది.క్షతగాత్రులు అందరూ అనుపల్లి గ్రామానికి చెందిన వ్యక్తులే. అనుపల్లి గ్రామం నుండి బ్రాహ్మణపల్లి పంచాయతీ కమ్మ కండ్రిగ గ్రామంలో జరిగే దహన క్రియల కార్యక్రమానికి వెళుతుండగా ఈ ప్రమాదంసంభవించింది. క్షతగాత్రులను 108 వాహనంలో చంద్రగిరి. ఏరియా హాస్పిటల్. తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. మరి కొంతమందిని చవట గుంటలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ఈప్రమాదంలో సుమారు 20 మందికి పైగా తీవ్ర. స్వల్ప గాయాలయ్యాయి. అందులో ఐదు మంది పరిస్థితి విష్మయంగా ఉంది. వెదురుకుప్పం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గలకారణాలను పరిశీలించి కేసు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
Tags; Maxi van overturned…several seriously injured

