Natyam ad

శ్రీవారి దయతో సమృద్ధిగా వర్షాలు కురవాలి- టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి

తిరుమల ముచ్చట్లు:

ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం కారీరిష్టి-వరుణ జపం- పర్జన్యశాంతి హోమం నిర్వహించామని, శ్రీవారి దయతో సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థించామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు   భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో ఐదు రోజుల పాటు జరిగిన యాగాలు శనివారం మహాపూర్ణాహుతితో ముగిశాయి.ఈ కార్యక్రమంలో ఈవో  ఎవి.ధర్మారెడ్డితో కలిసి టీటీడీ ఛైర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ వరుణదేవుని ఆశీస్సులు కోరుతూ 32 మంది ఋత్వికులు ధర్మగిరిలో ఎంతో నిష్టగా, అత్యంత అంకితభావంతో యాగాలు నిర్వహించారని తెలిపారు.అనంతరం ధర్మగిరి వేద పాఠశాల ప్రిన్సిపాల్  కె.ఎస్.ఎస్.అవధాని కారీరిష్టి-వరుణజప-పర్జన్యశాంతి మంత్రాలను పఠించి అందరితో పలికించారు.ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన  వేణుగోపాల దీక్షితులు, వైఖానస ఆగమసలహాదారు  మోహనరంగాచార్యులు, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శ్రీదేవి, విజీఓలు  బాలిరెడ్డి,  గిరిధర్ రావు, ధర్మగిరి వేద పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags:May it rain abundantly by the grace of Srivari- TTD Chairman Bhumana Karunakar Reddy

Post Midle