మాయా..మమత ఎవరికి వరం

Date:21/05/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:

ఈ నెల 23వ తేదీ. ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఎవరు ప్రధాని అవుతారో నిర్ణయించే తేదీ అది. దేశ వ్యాప్తంగా దీనిపై ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. భారతీయ జనతా పార్టీకి అధిక స్థానాలు దక్కితే పెద్ద సమస్య ఉండబోదు. ఎందుకంటే ఇప్పటికే కాబోయే ప్రధానిగా నరేంద్ర మోదీ పేరు దాదాపుగా ఖరారయింది. ఇక కాంగ్రెస్ కూటమి పరిస్థితే అగమ్య గోచరంగా తయారయింది. కాంగ్రెస్ కూటమిలో ఎవరు ప్రధాని అనేది ఆరోజే తేలనుంది. బీజేపీయేతర పక్షాల సమావేశం ఈనెల 23వ తేదీన జరగనుంది. సోనియాగాంధీ హాజరయ్యే ఈ సమావేశంలో కాంగ్రెస్ కూటమికి తగిన బలం ఉంటే ఆరోజే ప్రధాని ఎవరన్నది తేలిపోనుంది.అయితే కాంగ్రెస్ కూటమి అంటే ఇప్పటి వరకూ కట్టలేదనే చెప్పాలి. ముఖ్యమైన పార్టీలన్నీ కాంగ్రెస్ తో కలసి పోటీ చేయలేదు. ఉత్తరప్రదేశ్ లో బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ లు మాత్రమే పొత్తు పెట్టుకున్నారు. కాంగ్రెస్ ను కలవనీయలేదు. ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ ఒంటరిగానే బరిలోకి దిగింది. ఇక పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనూ మమత బెనర్జీ కాంగ్రెస్ ను కలుపుకుని పోలేదు. అక్కడ కాంగ్రెస్,కమ్యునిస్టులు మాత్రమే కలిశాయి. ఆంధ్రప్రదేశ్ లోనూ తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ ను కలుపుకుని పోలేదు. ఇలా విడివిడిగా పోటీ చేసిన వీరందరూ వచ్చే సీట్లను బట్టి ప్రధాని అభ్యర్థి ఎవరో నిర్ణయించే అవకాశముంది. మాయావతి, అఖిలేష్ యాదవ్, మమత బెనర్జీ ల పైనే ప్రధాని అభ్యర్థి ఎవరనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే మమత బెనర్జీ రాహుల్ ప్రధాని అయినా తమకు అభ్యంతరం లేదనిచెప్పేశారు. మాయావతి మాత్రం గుంభనంగా ఉన్నారు.

 

 

 

 

ఛాన్స్ చిక్కితే ఆమె వదిలేది లేదంటున్నారు. మాయావతి తొలి నుంచి రాహుల్ అభ్యర్థిత్వం పట్ల అంత సుముఖంగా లేరు. తనకు అన్ని రకాలుగా అర్హతలున్నాయని ఆమె భావిస్తుండటమే అందుకు కారణం. ఇక అఖిలేష్ యాదవ్ విధిగా మాయావతికే జై కొట్టాల్సిన పరిస్థితి కన్పిస్తోంది.భవిష్యత్తులో ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ కలసి నడవాలంటే మాయావతి వైపు అఖిలేష్ యాదవ్ మొగ్గు చూపాల్సి ఉంటుంది. చంద్రబాబునాయుడు మాయావతి, అఖిలేష్ యాదవ్ ను కలసి చర్చించినా ఫలితాల తర్వాతనే ఆలోచించాలన్నది వారి నిర్ణయమని సమాచారం. ఇలా కాంగ్రెస్ కు ఎవరూ ఊహించని విధంగా స్థానాలు వస్తే తప్ప రాహుల్ ప్రధాని అయ్యే అవకాశం లేదంటున్నారు. మాయావతి, అఖిలేష్ యాదవ్, మమత బెనర్జీల నిర్ణయంపైనేకాంగ్రెస్ కూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరో తేలే అవకాశముందన్నది సుస్పష్టం. మే 23వ తేదీన గాని ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం లేదు.

ఓటు హక్కు వినియోగించుకున్న 60 కోట్ల మంది

 

Tags: Maya is the gift of money

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *