కడప నగరంలో అతిపెద్ద 99 స్టోర్ షోరూంను ప్రారంభించిన మేయర్ సురేష్ బాబు
కడప ముచ్చట్లు:
కడపలో యువత వ్యాపార రంగంలో రాణించాలని నగర మేయర్ సురేష్ బాబు అన్నారు. అన్ని వస్తువులు ఒకే చోట కేవలం రూ.99 లకే 99 స్టోర్ షో రూమ్ లో లభించే విధంగా ఏర్పాటు చేయటం మెచ్చుకోదగ్గ విషయం అన్నారు.గురువారం కడప నగరంలోని అప్సర సర్కిల్ వద్ద 99 స్టోర్ షోరూంను నగర మేయర్ సురేష్ బాబు, ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాన్యులకు అందుబాటు ధరలో ఉండేవిధంగా నగరంలో 99 స్టోర్ షోరూంను ఏర్పాటుచేసిన సాయి, రాజు, శేఖర్ నాయుడు, నాగేంద్రలను అభినందించారు. 99 స్టోర్ షో రూమ్ లో వస్తువులు రూ.99 లకే లభించడం గొప్ప విషయమన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నగరవాసులకు పిలుపునిచ్చారు. అనంతరం 99 స్టోర్ షోరూమ్ యజమానులు సాయి, రాజు, శేఖర్ నాయుడు, నాగేంద్ర లు మాట్లాడుతూ కడప నగరంలో మొట్టమొదటిసారిగా కనీవినీ ఎరుగని రీతిలో అతి పెద్ద షోరూం మా 99 షోరూం అన్నారు. షోరూమ్ లో రూ.99లకు మాత్రమే వస్తువులు లభిస్తాయన్నారు. నాణ్యత కలిగిన వస్తువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రెండు వేల రకాల వస్తువులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఎవరికి డబ్బులు ఊరికే రావు.. కనుక అతి తక్కువ ధరలకే నాణ్యత కలిగిన వస్తువులు 99 స్టోర్ షో రూమ్ నందు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కడప నగర వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి, సురేంద్ర, భాస్కర్ వర్మ, బాలకృష్ణారెడ్డి, కిరణ్, రానా, పెద్దిరెడ్డి రామ్మోహన్ రెడ్డి, వినోద్ కుమార్, పసుపులేటి మనోజ్ కుమార్, గోపాలకృష్ణ, ఆర్ ఎన్. బాబు పాల్గొన్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Mayor Suresh Babu opens the largest 99 store showroom in Kadapa