కరోనా చికిత్సకు  పది వేలు దాటదు అధిక ఫీజులు వాసులు చేసే ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు : మంత్రి ఈటల

Date:3/08/2020

 

హైదరాబాద్ ముచ్చట్లు:

తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ..రాష్ట్రంలో ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. కరోనా బాధితులకి చికిత్స చేయడానికి పది వేలు దాటదని కానీ కరోనా పేరు చెప్పి ప్రైవేట్ హాస్పిటల్స్ క్యాష్ చేసుకోవడం మంచిది కాదు అని దీన్ని ఒక వ్యాపారంలా కాకుండా .. మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి చికిత్స అందించాలని అన్నారు. ఇప్పటికే ప్రైవేట్ ఆసుపత్రుల అధిక ఫీజుల వసూళ్ల పై సమీక్ష నిర్వహించామని సామాన్య ప్రజలను పీక్కుతినే ప్రైవేట్ ఆసుపత్రులపై తప్పకుండా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

 

అలాగే కరోనా సోకిన రోగులంతా ప్రభుత్వాసుపత్రుల్లోనే చికిత్స పొందాలని అనవసరంగా ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని ప్రజలకు కావాల్సిన సౌకర్యాలన్నీ ప్రభుత్వాసుపత్రుల్లో ఉన్నాయని మంత్రి తెలిపారు. కరోనా పేరు చెప్పి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారని బెడ్స్ లేవని కృత్రిమ కొరత సృష్టించి ప్రజల నుంచి ఎక్కువ డబ్బులు డిమాండ్ చేయడం.. మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు అడ్వాన్స్ లేనిదే చేర్చుకోకపోవడం రోజుకి లక్ష నుంచి రెండు లక్షల రూపాయల దాకా బిల్లులు వసూలు చేయడం రోగి మృతి చెందినా కూడా మానవతా దృక్పథం లేకుండా చార్జీలు చెల్లిస్తే తప్ప మృతదేహం అప్పగించం అని చెప్పడం  .. పేషెంట్ సీరియస్ కాగానే అంబులెన్స్లో పడవేసి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై మంత్రి సమీక్ష నిర్వహించారు.హైదరాబాద్ లోని టిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన  మంత్రి ఈటల కరోనా బాధితులకు అందుతున్న వైద్య సేవలపై ఆయన ఆరా తీశారు.

 

తర్వాత  మీడియాతో మాట్లాడుతూ కరోనా బాధితులకు గాంధీ ఆసుపత్రిలో అంకితభావంతో సేవలందిస్తున్నారని టిమ్స్ ను పూర్తిస్థాయిలో కరోనా ఆసుపత్రిగా మార్చామని తెలిపారు. ఆసుపత్రిలో 1350 పడకలు ల్యాబ్ లు ఐసీయూ అన్ని సౌకర్యాలు ఉన్నాయని వైద్యులు నర్సింగ్ మందులు అన్ని అందుబాటులో ఉన్నాయని మంత్రి రాజేందర్ తెలిపారు. అలాగే కరోనా లక్షణాన్ని మొదట్లోనే గుర్తిస్తే .. కచ్చితంగా కరోనా నుండి కోలుకుంటారని తెలిపారు.తెలంగాణలో అని అన్ని జిల్లాల్లోనూ కరోనా వైద్య కేంద్రాలు ఉన్నాయని హైదరాబాద్ లో కింగ్ కోఠి చెస్ట్ సరోజిని టిమ్స్ గాంధీ ఆసుపత్రులు ఉన్నాయని మంత్రి వెల్లడించారు. కరోనా ఆసుపత్రుల్లో కరోనా రోగులకు సరిపోయే బెడ్స్ ఉన్నాయని ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి ఇబ్బందులు పడవద్దని తెలియజేసారు. లిక్విడ్ ఆక్సిజన్ వారం రోజుల్లో పెట్టిస్తామని ఫీవర్ చెస్ట్ ఉస్మానియా సరోజిని కింగ్ కోఠి వరంగల్ ఆసుపత్రుల్లో లిక్విడ్ ఆక్సిజన్ పెడుతున్నామని మంత్రి తెలిపారు.

 

MLA ఆర్కె రోజా రాజంపేట లోక్ సభ సభ్యులు మిథున్ రెడ్డి కి రక్షాబంధన్ శుభాకాంక్షలు

Tags:Measures against private hospitals that charge high fees for corona treatment not exceeding ten thousand: Minister Itala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *