Natyam ad

మిర్చి పంట సంరక్షణకు చర్యలు

గుంటూరు ముచ్చట్లు:
 
రాష్ట్రంలో మిర్చి పంటకు కొత్త రకం త్రిప్స్ కారణంగా తీవ్ర నష్టం జరిగిందని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు పేర్కొన్నారు. దీనికి కారణాలు, విరుగుడు మార్గాల అన్వేషణకు నిపుణులతో సమావేశం నిర్వహించామన్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు, బెంగళూరు ఐఐహెచ్ఆర్  నిపుణులు, వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం, రాష్ట్ర ఉద్యాన శాఖ అధికారులు సమావేశానికి వచ్చారని జీవీఎల్ పేర్కొన్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో నిపుణుల బృందం పర్యటిస్తోందన్నారు. క్షేత్ర పర్యటన తర్వాత నిపుణుల బృందం నివేదిక ఇస్తుందన్నారు. పంటను భవిష్యత్తులో కాపాడేందుకు ఏం చేయాలో వారు నివేదిక ఇస్తారన్నారు. మనుషులకి కరోనా తరహాలో పంటలకు ఈ త్రిప్స్ ప్రమాదంగా పరిణమించాయన్నారు. దేశంలో 60 శాతం మిర్చి సాగు తెలుగు రాష్ట్రాలలో జరుగుతోందని జీవీఎల్ పేర్కన్నారు. అందుకే మిర్చి పంటను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. రైతులకు పంట నష్ట పరిహారం రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే జరుగుతుందన్నారు. రాష్ట్రంలో విపత్తు నిర్వహణ నిధుల నుంచి పరిహారం ఇవ్వొచ్చన్నారు. రాష్ట్రం వద్ద సరైన నిధులు లేకపోతే ఎన్డీఆర్ఎఫ్ నిధులు కోరవచ్చన్నారు. తాము కూడా కేంద్ర హోం శాఖతో మాట్లాడి వీలైనంత సాయం వచ్చేలా చేస్తామని జీవీఎల్ పేర్కొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Measures for chilli crop care