Measures for development of Boyakonda Road at a cost of Rs. 42.63 crore

రూ:42.63 కోట్లతో బోయకొండరోడ్డు అభివృద్దికి చర్యలు

– 21 కిలోమీటర్ల దూరంతో డబుల్‌ రోడ్డుపనులు
– సర్వేను ప్రారంభించిన ఆర్‌అండ్‌బి అధికారులు
– మదనపల్లెనుంచి వయా బోయకొండ రోడ్డుకు మహర్దశ
-మండలాభివృధ్దిపై మంత్రి పెద్దిరెడ్డి దశలవారీగా చర్యలు

Date:24/09/2020

చౌడేపల్లె ముచ్చట్లు:

జిల్లాలో నాల్గవ పుణ్యక్షేత్రంగా విరజిల్లుతున్న బోయకొండ గంగమ్మ ఆలయానికి వెళ్ళే భక్తులకు, అటువైపుగా మదనపల్లెకు వెళ్లే ప్రయాణీకులకు సౌకర్యంగా రూ:42.63 కోట్ల వ్యయంతో రోడ్డు అభివృద్దికి ప్రభుత్వం స్వీకారం చుట్టింది.వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చౌడేపల్లె మండలంపై అభివృద్ది చేసి ఆదర్శవంతంగా చేయాలనే ద్యేయంతో కృషిచేస్తున్నారు. చౌడేపల్లె నుంచి బోయకొండ మీదుగా మదనపల్లె వద్ద గల వలసపల్లె వరకు 21 కిలోమీటర్ల దూరం ఉన్న సింగిల్‌ రోడ్డును డబుల్‌రోడ్డుగా వెడల్పు చేయడానికి చర్యలు తీసుకొన్నారు. ఈ మార్గంలో ఇరుకు రోడ్డుతోపాటు అధిక మలుపులు ఉండడంతో మంత్రి పెద్దిరెడ్డి కృషితో ఎన్‌డిబి( న్యూ డవలప్‌మెంట్‌బ్యాంక్‌ )నిధులను రూ:42.63కోట్లు మంజూరుచేయించారు. ఈమార్గాన్ని 40 అడుగుల వెడల్పుతో అభివృద్దిచేసేందుకు ఆర్‌అండ్‌బి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈమేరకు గురువారం ఆర్‌అండ్‌బి జెఈఈ నరసింహులు సిబ్బందితో కలిసి చౌడేపల్లె నుంచి బోయకొండ మీదుగా వలసపల్లెకు వేళ్ళే రోడ్డుమార్గంలో అధికారులు నిర్ధేశించిన మేరకు సర్వే చేపట్టారు. ప్రభుత్వ స్థలంతోపాటు ప్రక్కన అవసరమైన స్థలంను గుర్తించి సరిహద్దులు ఏర్పాటుచేసేపనులు చురుగ్గా సాగుతున్నాయి. సర్వే ముగిసిన తరువాత వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకొంటున్నట్లు తెలిపారు.మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారంతో మండలాభివృద్దిపై చర్యలు తీసుకొన్నారు. బోయకొండలో భక్తులకు సౌకర్యంకోసం కోట్లాది రూపాయాల వ్యయంతో పలు అభివృద్దిపనులను చేపట్టిన విషయం తెలిసిందే.ఇటీవల చౌడేపల్లెనుంచి కల్లూరు వరకు రోడ్డుఅభివృద్ది, మండలంలో రెండు ఉపకాలువల ద్వారా హంధ్రీ-నీవా సుజల స్రవంతి ద్వారా సాగునీరు, తాగునీరు ఏర్పాటు చేయడం, గొప్పవరమన్నారు. ఈక్రమంలో చౌడేపల్లె నుంచి నిత్యం బోయకొండ గంగమ్మ ఆలయం, మదనపల్లె, నిమ్మనపల్లెమీదుగా వాహనాల రద్దీ ఉండటంతో మంత్రి స్పందించారు. డబుల్‌ రోడ్డును మంజూరుచేసి పనులు ప్రారంభం కావడంతో పరిసర ప్రాంతాల ప్రజలు, ప్రయాణీకులు, వాహనదారులు మంత్రి పెద్దిరెడ్డికు కృతజ్ఞతలు తెలిపారు.

వైఎస్సార్‌సీపీ నాయకుడు కెవిఆర్‌ మృతి

Tags: Measures for development of Boyakonda Road at a cost of Rs. 42.63 crore

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *