Measures for the establishment of canals in the YSSAR Colony

వైఎస్సార్‌కాలనీలో కాలువల ఏర్పాటుకు చర్యలు

Date:27/10/2020

చౌడేపల్లెముచ్చట్లు:

మండలకేంద్రంలోని వైఎస్సార్‌ కాలనీలో మురుగునీటి కాలువల ఏర్పాటుకు చర్యలు తీసుకొంటున్నట్లు ఎంపీడీఓ వెంకటరత్నం తెలిపారు. మంగళవారం ఏఐపీపీ మెంబరు అంజిబాబు, ఎంపీపీ అభ్యర్థి రామమూర్తి, మంత్రి పిఏ చంద్రహాస్‌లతో కలిసి కాలనీలో పర్యటించారు. ఇటీవల సాక్షిలో కాలనీలో గల సమస్యలపై కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన మంత్రి డాక్టర్‌పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక చొవర తీసుకొన్నారు. ప్రజల సౌకర్యార్థం మురుగునీటి కాలువల ఏర్పాటు చేయడం,తోపాటు వర్షపునీరు కాలనీలో గల లోతట్టు ప్రదేశాల్లోని ఇండ్లలోనికి వెళ్ళుతుండడంతో ఆనీటిని బయటకు మల్లించే విధంగా కాలువ ఏర్పాటుచేస్తామన్నారు.త్వరితరగతిన పనులు ప్రారంభించేలా చూస్తామని,అలాగే కాలనీలో గల సమస్యల పరిష్కారానికి మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాల మేరకు చర్యలు తీసుకొంటున్నట్లు ఆయన తెలిపారు.వారి వెంట పిఆర్‌ఏఈ పురుషోత్తం, నేతలు పద్మనాభరెడ్డి, కళ్యాణ్‌ తదితరులున్నారు.

 

హైదరాబాద్‌ వరద బాధితుల‌ కోసం నిర్మాత -హీరో రాంకీ

Tags; Measures for the establishment of canals in the YSSAR Colony

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *