రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు

కడప ముచ్చట్లు:


జిల్లాను రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా మార్చేందుకు రవాణా, ఇతర శాఖల అధికారులతో సమన్వయంతో కృషిచేయాలని జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్  ఆదేశించారు. బుధవారం నగరంలోని ‘పెన్నార్’ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో డి.ఎస్.పి లు, సి.ఐ లతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకునే ప్రాంతాల్లో వాహన దారులను అప్రమత్తం చేస్తూ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సైబర్ నేరాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించేలా ప్రచారం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా ఎస్.పి  కే.కే.ఎన్ అన్బురాజన్  ఆదేశించారు.  గ్రామ, వార్డు మహిళా పోలీసులను సైబర్ నేరాలపై క్షేత్రస్థాయిలో నిర్వహించే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేలా చూడాలన్నారు.  మహిళలపై నేరాలు, రాబరీ, డకాయిట్ కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేసి ఛార్జ్ షీట్ నమోదు చేయాలన్నారు.  మహిళలు, బాలికల అదృశ్యం కేసుల్లో సమగ్ర విచారణ జరిపి అదృశ్యమైన వారి ఆచూకీ త్వరగా తెలుసుకోవాలన్నారు.  అతి తీవ్రమైన నేరాలలో త్వరగా దర్యాప్తు పూర్తి చేసి నిందితులపై ఛార్జ్ షీట్ దాఖలు చేయాలన్నారు.  జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా మార్చేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

 

 

 

నాటుసారా తయారీ, విక్రయ దారులపై జిల్లా బహిష్కరణకు చర్యలు వేగవంతం చేయాలన్నారు.  స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులతో కలిసి నాటుసారా, అక్రమ మద్యం విక్రయాలపై సంయుక్తంగా దాడులు నిర్వహించాలన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి పకడ్బందీ చర్యలు చేపట్టడంతో పాటు నిఘా పెంచాలన్నారు.  మట్కా, క్రికెట్ బెట్టింగ్, జూదం తదితర అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. నిషేధిత గుట్కా, దేశీ అక్రమ మద్యం, ఇసుక అక్రమ రవాణాపై దాడులను ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఎస్.హెచ్.ఆర్.సి., ఎన్.హెచ్.ఆర్.సి ఫిర్యాదులపై తక్షణం స్పందించాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్.పి  ఆదేశించారు.  సమావేశంలో జిల్లా అదనపు ఎస్.పి (అడ్మిన్) పూజిత నీలం, జిల్లాలోని డి.ఎస్.పి లు, సి.ఐ లు, ఎస్.ఐ లు పాల్గొన్నారు.

 

Tags: Measures to control road accidents

Leave A Reply

Your email address will not be published.