స్పోర్ట్స్ కోట ఖాళీలను వెంటనే భర్తీ చేసేందుకు చర్యలు

Measures to fill sports fort spaces promptly

Measures to fill sports fort spaces promptly

Date:10/12/2019

కర్నూలు ముచ్చట్లు:

గ్రామ, వార్డు సచివాలయం స్పోర్ట్స్ కోట ఖాళీలను వెంటనే భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ అధికారులకు ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్పోర్ట్స్ కోట సచివాలయ ఉద్యోగుల ఖాళీల భర్తీపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయం స్పోర్ట్స్ కోటా లో ఎలిజిబుల్ లిస్ట్, ఇన్ ఎలిజిబుల్ లిస్ట్ వెంటనే వివరాలు అందజేయాలన్నారు. ప్రతి  రోజు సాయంత్రానికి వివరాలు తెలపాలన్నారు. అదేవిధంగా గ్రామ, వార్డు సచివాలయం లో ఉన్న ఖాళీ పోస్టులన్నీ వారం లోపల పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకొని జాయినింగ్ కాకపోతే ఎందుకు జాయినింగ్ కాలేదో వివరాలు తెలుసుకొని వారి దగ్గర నుంచి రాతపూర్వకంగా వ్రాయించి కోవాలని సూచించారు. సచివాలయం వెబ్సైట్లో ఉద్యోగుల  వివరాలు, వైయస్పార్ నవశకం సచివాలయ ఉద్యోగుల వివరాలు ఖచ్చితంగా ట్యాలి కావాలన్నారు. సచివాలయ వివరాలు వెంటనే ఆన్లెన్ చెయ్యకపోతే నమోదు చేయాలన్నారు. ఎస్పి డాక్టర్ పకీరప్ప, జేసి రవి పట్టన్ శెట్టి, డిఆర్ఓ పుల్లయ్య, డి పి ఓ ప్రభాకర్ రావు, పంచాయితీరాజ్ ఎస్ ఇ సుబ్బారెడ్డి, జిల్లాస్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

దుర్గగుడి దేవస్థానం నకిలీ వెబ్ సైట్ కలకలం

 

Tags:Measures to fill sports fort spaces promptly

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *