రక్త హీనత నివారణకు చర్యలు

Measures to prevent blood loss

Measures to prevent blood loss

Date:11/11/2019

చిత్తూరు ముచ్చట్లు:

రక్త హీనతతో బాధపడుతున్న వారందరికీ ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ తో కలిపిన ఆహార పధార్థాలను తప్పనిసరిగా అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డి.మార్కండేయులు పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లా సచివాలయంలోని జిల్లా జాయింట్ కలెక్టర్ చాంబర్లో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో “రక్తహీన రహిత భారత్ (అనీమియా ముక్త్ భారత్)” పై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో ప్రతి ఇద్దరిలో ఒకరు రక్త హీనతతో బాధపడుతున్నారని, వీరిలో ప్రముఖంగా గర్భవతులు, బాలింతలు, కౌమార బాలికలు ఎక్కువమంది బాధపడుతున్నారని తెలిపారు. అతి తీవ్ర రక్తహీనతను ప్రతి సంవత్సరం 3 శాతం తగ్గిస్తూ, 2022 నాటికి భారత దేశం నుండి అతి తీవ్ర రక్తహీనతతో బాధపడే వారికి ముక్తి కలిగించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రముఖంగా వైద్య ఆరోగ్య శాఖ మరియు ఐసిడిఎస్ సంయుక్తంగా జాతీయ స్థాయిలో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. ఇందులో భాగంగా 6 రకాలైన పద్ధతుల్లో మొదటి రకమైన రక్త హీనత నివారణకు ప్రయత్నించాలని అలాగే తదితర పద్ధతులలో భాగంగా రక్తహీనతను నివారించుటకు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలోని అలాగే ప్రైమరీ హెల్త్ సెంటర్లు, ఉప కేంద్రాలలో అలాగే ప్రముఖ ఆసుపత్రులలో అందరికీ ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ మాత్రలను సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు.

 

 

 

 

 

 

 

 

పాఠశాల విద్యార్థులకు, గర్భవతులకు, కొత్తగా పెళ్లి అయిన మహిళలకు మరియు 20 నుండి 25 సం.ల యుక్త వయసు వారికి తప్పనిసరిగా నట్టల నివారణా మాత్రలను మింగించాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలలో ప్రముఖ శాఖలైన విద్య, ఆర్ డబ్ల్యూ ఎస్, డిఆర్డిఏ, డ్వామా, సాంఘీక సంక్షేమ శాఖల సమన్వయంతో ప్రజలతో మమేకమై రక్త హీనతకు గల కారణాలను గురించి ప్రజలకు తెలియజేస్తూ రక్తహీనత విముక్తికి కృషి చేయాలని చెప్పారు. పాఠశాలలోని విద్యార్థులకు అలాగే అన్ని ఆసుపత్రులకు వచ్చే మహిళలకు మరియు ప్రజల ఇంటి వద్ద డిజిటల్ హిమోగ్లోబినో మీటర్ ద్వారా రక్త పరీక్షలు నిర్వహించి రక్తహీనత గలవారిని గుర్తించి వారందరికీ వైద్య చికిత్సలను అందించాలన్నారు. రక్తహీనతతో బాధపడుతున్న వారందరికీ ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ తో కలసిన ఆహార పదార్థాలను తప్పనిసరిగా అందించాలన్నారు. ఆహార సంబంధం లేకుండా కూడా మలేరియా, నట్టలు, ఫ్లోరాసిస్ ద్వారా కూడా రక్తహీనత వచ్చే అవకాశం ఉన్నందున, వాటిని కూడా అధిగమించి రక్త హీనతను దేశం నుండి పారద్రోలెందుకు కృషి చేయాలని తెలిపారు. ప్రజలందరూ ఐరన్, విటమిన్ సి, మాంసకృత్తులతో కూడిన పచ్చని ఆకు కూరలు, కాయగూరలు, పండ్లు, పప్పు దినుసులు, కోడి గ్రుడ్లు, రాగి, మునగ, మొదలైనవి తిని రక్తహీనతను నివారించుకోవలసినదిగా చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి మురళి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. రామ గిడ్డయ్య, డిసిహెచ్ఎస్ డా. సరళమ్మ, ఐసిడిఎస్ పిడి అరుణా దేవి, డిపిహెచ్ఎంఓ రాణి, అడిషనల్ డిఎంహెచ్ఓ డా. పెంచలయ్య, హెచ్ఇఇఓ సుధాకర్ రెడ్డి, హెచ్ఇ కృష్ణా రెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు.

 

జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు కెజిబివి విద్యార్థిని

 

Tags:Measures to prevent blood loss

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *