Natyam ad

రహదారి ప్రమాదాల నివారణకు చర్యలు -జెటిసి బసిరెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు జాయింట్‌ కమిటి ఆధ్వర్యంలో నివారణ చర్యలు తీసుకుంటున్నట్లు జెటిసి బసిరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన స్థానిక ఆర్‌టీవో కార్యాలయంలో ఏఎంవిఐ సుప్రియా తో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. బసిరెడ్డి మాట్లాడుతూ రహదారులపై ఎక్కువుగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను ఇంజనీరింగ్‌, పోలీస్‌, రవాణాశాఖ అధికారులతో ఏర్పడిన బృందం పరిశీలించి ఆప్రాంతాలను గుర్తించడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ప్రమాద ప్రాంతాలపై కమిటి నివేదికలు సమర్పిస్తుందన్నారు. తద్వారా ఆప్రాంతంలో తీసుకోవాల్సిన నివారణ చర్యలను తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణలపై కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని ఎంవిఐలను ఆదేశించడం జరిగిందన్నారు. ఒకొక్క ఎంవిఐ పరిధిలో మూడు సదస్సులు నిర్వహించేలా సూచించామన్నారు. ప్రతి ఒక్కరు హెల్మెంట్లు ధరించాలని పేర్కొన్నామన్నారు. ముఖ్యంగా గత నెలలో ట్రాక్టర్ల ప్రమాదాలు అధికమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాక్టర్‌ యజమానులు, డ్రైవర్లు ఈ విషయమై జాగ్రత్తలు తీసుకుని వేగంగా ప్రయాణించడం , సెల్‌ఫోన్లు మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయడం ప్రమాదమని , వీటిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి ఒక్కరు రహదారి నిబంధనలను పాటించాలని లేకపోతే అమాయక ప్రజలు రోడ్డు ప్రమాదాలలో బలికావాల్సి వస్తుందన్నారు. రహదారి నిబంధనలు ఉల్లగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, లైసెన్సులు రద్దు చేయడంతో పాటు వాహనాలను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు.

Post Midle

Tags: Measures to prevent road accidents – JTC Basireddy

Post Midle

Leave A Reply

Your email address will not be published.