Measures to protect the environment

పర్యావరణ పరిరక్షణకు చర్యలు

Date:17/10/2020

పుంగనూరు ముచ్చట్లు:

వాతావరణంలో పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించి, పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. శనివారం స్వచ్చ సర్వేక్షణ్‌లో భాగంగా పారిశుద్ధ్య పక్షోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా హ్గం కంపోస్ట్ ఎరువును పట్టణంలో నాటిన వెహోక్కలకు వేయించారు. మొక్కలన్నింటికి ట్రీగార్డులు ఏర్పాటు చేశారు. కమిషనర్‌ మాట్లాడుతూ పట్టణంలో సుమారు యాబైవేల మొక్కలను నాటడం జరిగిందన్నారు. వీటికి మున్సిపల్‌ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి కాపాడుతున్నామన్నారు. ప్రస్తుతం ట్రీగార్డులు ఏర్పాటు చేసి, హోం కంపోస్ట్ ఎరువును వెహోక్కలకు వేయించామన్నారు. పర్యావరణ కాలుష్యాన్ని నివారిస్తూ, పట్టణాన్ని హరిత పట్టణంగా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులై , పట్టణంలో విరివిగా వెహోక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సఫ్ధర్‌, సురేంద్రబాబు, మున్సిపల్‌ కార్మికులు పాల్గొన్నారు.

రైతులు ఉలవ పంటలు పండించేందుకు సిద్దంకండి

Tags: Measures to protect the environment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *