మాంసం దుకాణాలు బంద్‌

Date:08/04/2020

పుంగనూరు ముచ్చట్లు:

కరోనాను నియంత్రించేందుకు పుంగనూరు మండలం, పట్టణంలో అన్ని మాంసం దుకాణాలను , హోటళ్ళ ను, 9 నుంచి మూసి వేస్తున్నట్లు తహశీల్ధార్‌ వెంకట్రాయులు తెలిపారు. ప్రభుత్వాదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తక్షణమే వ్యాపారులు దుకాణాలు మూసివేయాలన్నారు. 48 గంటల తరువాత కరోనా నియంత్రణలో ఉంటే ఈ విషయమై తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా షాపులు తెరిచినా , విక్రయించినా క్రిమినల్‌ కేసులు నమోదు చేసేలా అన్నిశాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.

పుంగనూరు క్వారంటైన్‌ సెంటర్‌ నుంచి ఇండ్లకు

Tags: Meat Shops

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *